పుట:Balavyakaranamu018417mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్యాంతములయందు గణానుసారంబుగ వ్యవస్థితంబయియుండు గుర్వవసాయియగు పద్యంబుతుదను స్వత్వంబులేదు. అతిశయముగ బుద్ధిమంతుఁడగు బుధసేవన్‌.

21. కొన్నియెడల ద్రుతంబుమీఁద నకారంబు గానంబడియెడి.

అదియునున్గాక, దివంబునుంబోలె.

22. అఁట యిఁక చుఁడు శబ్దంబులం దప్ప నుడి తొలి హ్రస్వంబుమీఁద ఖండబిందువును ద్రుతంబునకు లోపంబును లేవు.

ముంగొంగు, క్రొంబసిఁడి, కన్దోయి.

23. తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు.

తాను ... ౘదివె ... తాఁ ౙదివె, తాను ౙదివె

తాను ... వినె ... తా వినె, తాను వినె

దీర్ఘంబు మీఁదిది గాన దీనికి నెఱసున్న లేదు.

24. సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు.

ఎల్లయర్థములు, ఎల్లకలుషములు. సర్వపర్యాయంబయిన