పుట:Balavyakaranamu018417mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పక్షంబున స్వత్వంబగు. స్వత్వంబనఁగా ద్రుతంబునకుఁ బ్రకృతి భావము.

18. ద్రుతంబునకు సరళస్థిరంబులు పరంబు లగునపుడు లోపసంశ్లేషంబులు విభాష నగు.

వచ్చెను ... గోవులు ... వచ్చె గోవులు, వచ్చెన్గోవులు, వచ్చెను గోవులు

మెఱసెను ... ఖడ్గము ... మెఱసెఖడ్గము, మెఱసెన్ఖడ్గము, మెఱసెను ఖడ్గము

19. వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకుఁ బూర్ణబిందువును గానంబడియెడి.

వచ్చెను ... ధాత్రీపతి ... వచ్చెంధాత్రీపతి

పాడెను ... గంధర్వుఁడు ... పాడెంగంధర్వుఁడు

కన్‌ ... దోయి ... కందోయి

20. అవసానంబునందు ద్రుతస్వరంబునకేని ద్రుతంబున కేని లోపంబు బహుళంబుగా నగు.

వాఁడువచ్చెన్‌ - వాఁడువచ్చె - వాఁడువచ్చెను. ఈలోపంబు