పుట:Atibalya vivaham.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతిబాల్యవివాహము

43

వేరుప్రయోజన మగుపడుచుండలేదు. తక్కిన యే సుభకార్యముల కెట్లు చేసినను వివాహకార్యమునందు మాత్రము వరుని జాతకపత్రమును పరిశీలింపించికొననివారును మంచి మూహూర్తమును పెట్టించుకొననివారును సాధారణముగా నుండరు. అట్లయినను ముహూర్తమును పెట్టించుకొనని హూణులు మొదలయినవారిలో కన్న సుముఃహూర్తముల కయి కాలమును ధనమును వెచ్చ పెట్టెడు హిందువులలోనె విధవ లధికముగా నున్నారు. జ్యౌతిషమువలన ప్రయొజనలేశమయినను కలిగిన యెడల శుభలగ్నములయందు వివాహితలయిన వారిలో నిన్న లక్షలమంది బాలవిధవ లెందుచెత కావలయునా యని నాకు సందేహము కలుగుచున్నది. ఇట్టి సందేహమే మనవారి కందరికిని కలిగెడుపక్షమున, ముహూర్తమృత్యుదేవతనోటినుండి విధవలు కాకుండ ప్రతి సంవత్సరమును లక్షలకొలది పసిబాలికలను కాపాడవచ్చునని నాకు తోచుచున్నది. అది యట్లుండ నిండు.

మనవా రిప్పుడు సామాన్యముగా బ్రాహ్మణ వర్ణమునకు, హిందూశాస్త్రములు బాల్యవివాహములు విధించు చున్నవనియు, శాస్త్రవిధానము దుర్లంగ్యమనియు భావించుచున్నారు. అట్టి వారికి సఛ్శయనివారణము కలుగుటకయి నాకు దెలిసినంతవరకు వివాహ విషయమున గల శాస్త్రమును కూడ సంగ్రహముగా వివరింతుచున్నాను. వేదమంత్రములును మంత్రవినియోజకవాక్యము లయిన కల్పసూత్రములును సంబంధించి యున్నంతవరకును, బాల్య వివాహముల కనుజ్న యెక్కడను లేదు సరిగదా, వ్యక్తురాలయిన కన్యకే వివాహము చేయవలసినట్టుకూడ కనబడుచున్నది.

వివాహమంత్రములొని "సోమ:ప్రథమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: తృతీయో అగ్నిష్టే స్తురీయస్తే మనుష్యజా: సోమోదద ద్గంధర్వాయ గంధ్ర్వో దద దగ్నయే : రయించ పుత్రాం