పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీ తోప్రా స్తంభము

121


ఈదినములయందు వృషములను తీసి వేయఁగూడదు. ఇంతకు పూర్వము వృషములు తీయబడిన గొట్టెలు, పొట్టేళ్ళు, పందులు, మొదలగువానికి మఱల వృషములను తీయఁగూడదు.

2 తిష్యపుసర్వసు నక్షత్రములలోను, చాతుర్మాస్య దినముల లోను, చాతుర్మాస్యములోని ప్రతి పక్షము నందును, గుఱ్ఱములకును, నృ షభము లకును చుఱకలు వేయఁగూడదు. (12) నేను రాజ్యాభిషిక్తుడ నైన యీయిరువది యాఱు సంవత్సరములలోను, ఇరువది యైదుసార్లు కారాగృహవాసులను విడుదలచేయించితిని.

ఆరో స్తంభ శాసనము : ఢిల్లీ తోప్రా స్తంభము- తూర్పుముఖము.

1.(1) దేవానః పియే పియదసి లాజ హేవు అహా (2) దువాడస-
2.వస అభిసి తేన మే ధంమలిసి లిఖాపి తా లోక సా
3.హేతసుఖాయే నే తం అపహటా తం తం ధంమవఢి పాపోహ
4.(3) హేవం లోక సా హితసుఖే తి పటి వేఖామి ఆథ ఇయం
5.నాతిసు హేవం పతియాసంనేను హేవం అవకఠేసు
6.కిమం కాని సుఖం అవహామీ తి తథ చ విదహామి (4) హే-
మేవా
7.సవనికా యేసు వటి వేఖామి (5) సపపాసండా పి మే పూజితా
8.వివిధాయం పూజాయా (6) ఏ చు ఇయం అతనా పచూపగమనే
9.సే మే మోఖ్యమతే (7) నడువీ సతివస అభిసి తేన మే
10.ఇయం ధంమలిపి లిఖాపి తా
16