పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

అశోకుని ధర్మశాసనములు.



తెనుగు

(1) దేవానాంప్రియుండగు ప్రియదర్శిరా జిట్లు చెప్పుచున్నాడు. (2) నా రాజ్యాభిషిక్త కాలము ఇరువది యాఱవ సంవత్సరమున చిలుకలు, మైనలు, అరుణపక్షులు చక్ర వాకములుు హంసలు, నాందీముఖపక్షులు, గేలాటపక్షులు గబ్బిలములు, చెదపురు గులు. చీమలు ఎముకలులేనిచేపలు. జీవంజీవకములు నీటి కోళ్ళు, శకులమధ్యములుు,ఆాబేళ్ళు ముళ్ళపందులు, ఉడుతలు సుమరములు యభేచ్చముగ విడిచిపెట్టంబడిన ఆంబోతులు ఓకపిండములు, ఖడ్డమృగములు అెల్ల పావురములు,ఊరిపావుర ములు అనుపయోగములును,అభోజ్యములయిన చతుష్పాద జంతువులు. ఇట్టి ప్రాణులను చంపకూడదని నేనాజ్ఞా పించి యున్నాను. (3) మేకలు,గొఱ్ఱెలు, పందులు-ఇవి కడుపుతో నున్నను పాలిచ్చుచున్న వైనను వానిని చంపకూడదు. ఆఱు నెలలకు తక్కు_వయైన వీనిపిల్లలనుకూడ చంపకూడదు. (4) కోళ్ళను కోయకూడదు. (5) జీవజంతువులను ఊకలోపెట్టి కాల్చకూడదు (6) నిరర్ధకముగాను, అందలిజంతువులను నాశ నము చేయుటకును అడవులను తగులపెట్టకూడదు. (7) జీవ జంతంవుల నాహారము పెట్టకూడదు. (8) మూడుచాతుర్మా స్యదినములందును, పుష్యపూర్ణిమ నాడును, చతుర్దశి, వున్నమ లేక అమావాస్య, పాడ్యమి, తిధులనాడును, ఉపవాసదినము లందును చేపలను చంపకూడదు, వానిని అమ్మగూడదు. (9) ఆదినములందు నాగవనమునందును, కైవర్త భోగమునందును ఉన్న ఎట్టి ప్రాణులనుకూడ చంపకూడదు. (10) రెండుపక్షముల యందును అష్టమి,చతుర్దశి,అమావాస్య, తిష్య వునర్వసు నక్షత్రములు మూడుచాతుర్మాస్య దినములు-పర్వదినములు.