పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

అశోకుని ధర్మశాసనములు.


సంస్కృతము

(1) దేవానాంప్రియ: ప్రియదర్శీ రాజా ఏవమాహ(2) ద్వాదశవ ర్షాభిషిక్తేనమాయా ధర్మలిపి ర్లేఖితా లోకస్య హితసుఖాయ, తత్త దసహృత్య సా సా ధర్మవృద్ధిః ప్రాప్తవ్య (3) ఏవం లో- కన్య హితసుఖే ఇతి ప్రత్యవేక్షే యధేదం జ్ఞాతిషు ఏవం ప్ర- ఆ్యాసన్నేషు ఏవ మవకృష్టేషు కిం కేపాంసుఖ మావహామితి తథా చ విదధే (4) ఏవమేవ సర్వనికాయేషు ప్రత్య వేక్షే (5) సర్వపాషణ్డా అవీ మే పూజితా వివిధయా పూజయా (6) యత్తు ఇదం ఆత్మనా ప్రత్యుపగమనం త న్మే ముఖ్యమతమ్‌ (7) షడ్విం శతి వర్హాభిషిక్తేన మ యేయం ధర్మలిపి ర్లేఖితా.

తెనుగు

(1) దేవతా ప్రియుడగు ప్రియదర్శిరా జిట్లు చెప్పుచున్నాడు. (2) నేను రాజ్యాభిషిక్తుడనై పండ్రెండవ సంవత్సరమున జనులహిత ము కొఱకును, సౌఖ్యము కొఱకును ఈశాసనముల నతిక్రమింపక య నేకవిధముల వారు ధర్మాభివృద్ధిని పొందుటకును ఈధర్మలిపులు నాచేత లిఖంపబడినవి. (3)“ఈవిధముగా జనులకు హితమును, సౌఖ్యమును, కలుగును" అనితలంచి. నాబంధువులనేకాక దగ్గరగ నున్నవారినిి, దూరముగనున్న వారినిగూడ, సౌఖ్యవంతులుగ జేయుటయందు శ్రద్ధ నహించి, అట్లే వారికి ధర్మోపదేశము చేయుచున్నాను. (4) ఈవిధ ముగానే సర్వశాఖల వారియెడలను శ్రద్ధవహించి యున్నాను (5) సను స్తశాఖలవారును వివిధపూజల చేక నావలన గౌరవింపయుడియున్నారు. (6) జనులయొద్దకు నేను స్వయముగాపోవుటయే నాముఖ్య మతమయి యున్నది. (7) నారాజ్యాభిషిక్త కాలము ఇరువదియాఱవఏట నా చేత నీధర్మలిపి లిఖింపంబడినది.