పుట:Annamacharya Charitra Peetika.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11 దిగువతిరుపతి క్షేత్రము పొలిమేరలో తాళ్ళపాకగంగమ్మ యను గ్రామదేవత గలదు. తాతాయుగుంట గంగమ్మ అంకాళమ్మ ఇత్యాది నామముల గ్రామసీమాదేవత లింకను గలరు. అందరకంటెఁ దాళ్ళపాక గంగమ్మ ప్రాచీనదేవతయట. ఇప్పటికి నాదేవి తిరుపతి పొలిమేరలోనే కలదు. పూర్వము తిరుపతియాత్రకు వచ్చు యాత్రికు లాక్షేత్రదేవత నర్చించి క్షేత్రప్రవేశము చేయుచుండెడివారట. అన్నమయ యాదేవతకు మొక్కు చెల్లించెను. (చూ. 14 పుట.) తొలుత నాదేవతను తాళ్ళపాక (1) తాతాయగుంట గంగమ్మను గూర్చి యీకథ గలదు :- ఎప్పడో తిరుపతి నుండి తిరుమల తాతాచార్యులవారు శిష్య సంచారము చేయుచు కడప ప్రాంతముల నొక యూరి కరుగఁగా జరిగినది :- ఆయూర నెన్నఁడో వెలసియున్న గంగానమ్మ భయంకరవ్యాధులచే ప్రతివత్సరము నసంఖ్యాకజనమును నాహుతి కొనుచుండుటయు నొకప్పుడు జాత్ర జరగుచుండఁగా నామె జాలి దలఁచి యేఁడాది కొకనరబలి యిచ్చుచో నీమారణ మాపివేయుదు ననుటయు గ్రామసులందుల కంగీకరించుటయు జరిగెను. ఏటేఁట జాతరనాళ్ళలో బాటసారిగా వచ్చిన పరాయి యూరివాని నొకని బలిపెట్టుట జరగుచుండెను. ఒకయేఁట తాతాచార్యులుగారు చిక్కిరి, గురువుగారిని గోల్పోవటాయని యూరివారు తటపటాయింపసాగిరి. ఎట్లో తెలిసఆచార్యులవారు భీమునివలె బలి యగుదునని వెఱపు మాన్పిరి, బలి గావలసిననాఁడు జాతరచోట అష్టాక్షరీనారాయణ కవచాదుల ననునంధించుచు శిష్యులకుఁ జేయు శంఖచక్రముద్రాంకితముల తీరునఁగాక కణ కణ నిప్ప రగిల్పించి శంఖచక్రముద్రల నెజ్జగా(గాల్చి యుంచిరి. జాతరలో నమ్మవారి పూనకముతో నొకబత్తుఁడు బలిబలి యనుచు వారిమీఁదికి దూకెను. ఆచార్యులవారు పటుకార్లతో శంఖచక్రముద్రల నాపూనకమువాని రెండు భుజముల మీ ఁద గట్టిగా నంటించఁ బోయిరి. శివశక్తి పాటిపోఁజూచి వెనుదిరిగెను గాని మంత్ర ప్రభావముచే నడుగు సాగక నిలిచిపోయెను. ముద్ర వీపుమీఁదఁబడెను. తాతాచార్యులుగారిముద్ర భుజముదప్పినా వీపతప్పదన్న సామెత తదాదిగా వెలసెను. గంగానమ్మయాయాచార్యులవారి కాళ్లపై వాలి శరణాగతురాలయ్యెను. ఆమెకు శిష్యత ననుగ్రహించి యాచార్యులవారు తిరుపతికిఁ దోడైచ్చి యూరివెలుపల నెలకొల్పిరి. నాఁటితో నాగ్రామపువారి కామెవలని పీడ తొలఁగెను. నాఁటనుండి తిరుపతిలో తాతాచార్యులవారి యనుమతి నామెకేఁటేటఁ జంతుబలులతోను, మద్యపుఁ జూఱలతోను నిన్నటిదాఁక జాతర సాగినది. మహాత్ములయునుగ్రహమున నేఁ డామె శుద్ధసాత్త్వికురాలై మద్యపుంజూజను జంతుబలిని విడనాడినది.