12 యన్నమయ యర్చించుటచేతనేమో యూమెకు తాళ్ళపాక గంగమ్మయని పేరయ్యెను. తిరుపతిలో నేఁటేఁట జరుగు గంగమ్మ జాతర యీగంగా నమ్మలకై యేర్పడినదే. అన్నమయ యుంతటఁ దిగువతిరువతికి విచ్చేసి యిటు సంకీర్తనము చేసెను.
మలహరి
అదె చూడు తిరువెంకటాద్రి నాలుగుయుగము! లందు వెలుఁగొంది ప్రభమీఱఁగాను ||పల్లవి||
తగనూటయిరవై యెనిమిది తిరుపతులం గల స్థానికులును చక్రవర్తి పీఠకములును! అగణితంబైన దేశాంత్రులమఠంబులును నధికమై చెలు వొందఁగాను! మిగుల నున్నతములగు మేడలును మాడుగులు మితిలేనిదివ్యతపసు లున్నగృహములును! వొగినొరగుఁబెరుమాళ్ళవునికి పట్టయి వెలయు దిగువ తిరుపతి గడవఁగాను ||అదె|| 1
పొదలి యరయోజనము పొడవుననుఁబొలుపొంది పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి చెదర కేవంకఁ జూచిన మహాభూజములు సింహశారూలములును! కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును గరుడగంధర్వ యక్షులును విద్యాధరులు! విదితమై విహరించు విశ్రాంతదేశముల వేడుకలు దైవాఱఁగాను ||అదె|| 2
ఎక్కువల కెక్కువై యొసగి వెలసిన పెద్ద యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద! అక్కజంబైన పల్లవరాయని మఠము అలయేట్ల పేడగడవన్!