Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

నున్నఁగా సంకీర్తన నానోరి కిచ్చితి గనుక! నన్ను రక్షింతువే యనుచు నమ్మితి నేను! పిన్ననాఁడే నీవు నన్నుం బేరుకొంటివి గనుక! యొన్నంగ నీడేర్తు వని యియ్యకొంటి నేను ||సందే|| 1

శ్రీకాంతుఁడ నీమూర్తి నాచిత్తములో నిల్పఁగాను! నాకు నీవు గల వని నమ్మితి నేను! దాకొని లోకములో నీదాసుం డనిపించఁగా! ఈడక నేలితి వని యెఱిఁగితినేను ||సందే|| 2

కైవసమై నీవు నాకుఁ గలలో నానతియ్యఁగా! నావద్ద నున్నాఁడ వని నమ్మితి నేను! ఏవేళా శ్రీవేంకటేశ యెదుటనే వుండఁగాను! పావనమై యిన్నిటాను బ్రబలితి నేను ||సందే|| 3 అన్న అధ్యాII వాల్యుం 244 పేజి.

తిరువతికిఁ బయనము

అన్నమయ కాడినమా టెల్ల నమృతకావ్యముగాను, పాడినపా టెల్లఁ బరమగానముగాను గాఁజొచ్చినవి. తిరుపతి యాత్రకుఁ బయనమయ్యెను. పరుసగుంపువా రిటు పాడఁజొచ్చిరి. (చూ 13 పుట.)

వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ||పల్లవి||

ఆమటి మొక్కులవాఁడే ఆదిదేవుఁడే వాఁడు తోమని పళ్యాలవాఁడే దురితదూరుఁడే ||వేడు|| 1

వడ్డికాసులవాఁడే వనజనాభుఁడే పుట్టు గొడ్డురాండ్రకు బిడ్డలనిచ్చే గోవిందుఁడే ||వేడు|| 2

ఎలమిఁగోరినవరా లిచ్చే దేవుఁడే వాఁడు అలమేల్మంగా శ్రీవెంకటాద్రినాథుఁడే ||వేడు|| 3 తాళ్లపాక శేషాచార్యులుగారి వ్రాఁతప్రతి.