9 స్వామి సాక్షాత్కారము అన్నమయకుఁ బదునాఱవయేఁట స్వామి ప్రత్యక్ష మంున ట్రాయన సంకీర్తనముల తొలి రాగితేకుమీఁదఁ జెక్కంబడి యున్నది. నాఁట నుండియే స్వామియానతి చొప్పన నాతఁడు సంకీర్తన ములు రచింప నారంభించెను. నమ్మాళ్వార్లు (శఠకోపయతి) కూడఁ బదునా అవయేఁటనే ప్రజ్ఞాపూరులై దివ్యప్రబంధరచన సాగించిరి. అన్నమయ తనకు స్వామి బాల్యమున దర్శన మిచ్చుట నిటు సంకీర్తనములఁ జెప్పకొన్నాఁడు. భూపాలం ఇప్ప డిటు కలగంటి నెల్లలోకములకు నప్పఁడగు తిరువెంకటాద్రీశుఁ గంటి ||పల్లవి| అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ప్రతిలేనిగోపురప్రభలు గంటి శతకోటిసూర్యతేజములు వెలుఁగఁ గంటి చతురాస్యుఁ బొడగంటిఁ జయ్యన మేలుకంటి ఇప్ప) 1 కనకరత్నకవాటకాంతు లిరుగడఁ గంటి ఘనమైనదీపసంఘములు గంటి అనుపమమణీమయ మగుకిరీటము గంటి కనకాంబరము గంటిఁ గ్రక్కన మేలుకంటి |ఇప్ప 2 అరుదైన శంఖచక్రాదు లిరుగడఁ గంటి సరిలేనియభయహస్తము గంటిని తిరువెంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటి హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి ఇప్ప 3 అన్న, అధ్యా. 6 తేకు. పాడి సందేహ మెక్కడా లేదు సంతోషించుకొంటి నేను కందువ బ్రహ్మానందము గైకొంటి నేను పల్లవి
పుట:Annamacharya Charitra Peetika.pdf/11
Appearance