పుట:Annamacharya Charitra Peetika.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

101 దాను పలికితి నని చెప్ప కొన్నాఁడు. ఆతఁ, డాడినది యమృతకావ్యము పాడినది వరమనంకీర్తనము నంునది. అన్నమయు తెలుఁగు నొడికారముసఁ గడుదిట్ట. సంస్కృతమునఁ గూడ సత్కవితారచన నేర్చినవాఁడు. పెద తిరుమలాచార్యుదులు సంస్కృతాంధ్రాది భాషలలో నన్నమయవలె విద్వాంసులు. పెదతిరుమలాదులరచనలలో పాండిత్య ప్రకర్షము పదబంధపు జిగిబిగి యధికముగా నుండును. అన్నమాచార్య సంకీర్తనములును శృంగారమంజరియు తేటతేటగా తేలిక తేలికగా తియ తియ్యగా హాయి హాయిగా గోస్తనీద్రాక్షాగుళుచ్ఛములవలె నాస్వాద్యము లయినవి. వానియర్ధవిశేషములు శ్రోతలహృదయములలో సులువుగాఁ జొరఁబాటీ వానిని చూఅగొని కొనిపోయి యేడుకొండల నెక్కించి భగవంతునిపాదారవిందములపజ్ఞ నడంకువతో నత్తియుండు నటు చేయఁగలవి! అన్నమాచార్యుఁడు తిరుపతి కొండమీఁద జగదేక నాథుఁడు ప్రత్యక్షమై వెలసియున్నాఁ డని ఓహెూప్రజలారా నామాట వినుండు దర్శించి కృతారులు కండు రండు రం డని రెండుచేతు లెత్తి యాహ్వానించిన తీ రాలకింపఁదగినది. రావు క్రియు చాటెద నిదియే సత్యము సుండో చేటులే దతని సేవించినను ||పల్లవి! హరి నొల్లనివారసురలు సుండో సుర లీతని దాసులు సుండో పరమాత్ముఁ డితఁడె ప్రాణము సుండో మరుగక మఱచిన మఱిలే దింకను 85יסוןd31 ון వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో సోదించె శుకుఁ డచ్చుగ సుండో అది బ్రహ్మగన్నాతఁడు సుండో యేదెస వెదకిన నితఁడే ఘనుఁడు 85יסוןd3it 2