పుట:Annamacharya Charitra Peetika.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

100 కi జగతిఁ గడుఁ జెల్లుబళ్ళై నగి నగి భాషించునట్టి నానుడి పలుకుల్ తగ దన రహిచెడుఁ బువ్వల సొగ సుడుగన్ బిసికి కంపుసూపిసభంగిన్| వచ్చీని పోయిని చేసీని ఆడుతా చేయరంటా చిముడుతా ఏమిచెప్పే దమ్మా అమ్మలాలా అయ్యలాలా ఏవూరికేవూరు యేనాటి ఋణము (సంధి కూర్చవలసినచోట్లు కూర్పక వ యు ఆగమములు చేర్చుట) పోయె ఆయె ననుటకు పోయ ఆయు అనుట, లోకవాడుక దినదిన కొత్తలు(వైరిసమాసములు) ఇత్యాదివిధముల వాడుకభాష నీకవులు ప్రయత్పముతోఁ గోరి ప్రయోగించినారు. అరవములోవలె నీకవులు ఉదంతతద్దర్మార్ధకక్రియాజన్యవిశేషణములకు సమాసములో ద్రుతము చేర్చిరి. పోవుంబ్రోవ చెప్పంబలుకు ఇత్యాదులు. దీమ సపుఁబారివార (వారలార అనుటకు) కట్టివార (వారలార అనుటకు) ఇట్టిప్రయోగము నాచనసోమనయు వెజ్జివారపిడుగు ప్రేసినఁ దలటోప్పి యూగునే' అని చేసెను. నాచన సోవునరచనల యునుకృతులీ సంకీర్తనములలోఁ జాలఁగలవు. ఎదిరికి న్మడఁచువాఁడు తనకుఁ దగరంబు సఱచు టెంతటిభరమ్ము నాచనసోమన నానుడి యిది ఎనలేక యెదిరికి యినుమడిచేవానికి తనకు తగర మడువఁదడ వం్యూనా' అని సంకీర్తనమున కెక్కినది. నిఘంటువుల కెక్కని దేసి తెలుఁగుపలుకు లీసంకీర్తనములలో నెన్నో కలవు. అట్టివాని నెల్ల సేకరించి వేఱుగా నిఘంటువులకుఁ బరిశిష్టములు వెలయింపఁ దగును. కవితారీతులు అన్నమాచార్యుఁడు నరనన్న (కవికర్ణరసాయనకర్త?) పెద తిరుమలయ్య చినన్న-శబ్దార్ధశుద్ధి గలిగిన వరకవులు. అన్నమయ మజీసరిగాఁ బోతనవలె సహజకవితావిశారదుఁడే. స్వామి పలికింపఁగా