పుట:Andhrulacharitramu-part3.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దున గాలము ప్రతికూలముగ నున్నదని అనపోతభూపాలుడు వారుకోరిన ధనము నిచ్చి సంధిచేసికొని తురుష్కులను బంపివేసెను.

మహమ్మదుషాహ పరాజితు డగుట

క్రీ. శ. 1373 వ సంవత్సరాంతమున మహమ్మదుషాహ కడకు గుఱ్ఱములవ్యాపారము చేయుకొందఱువర్తకులు వచ్చి వానికొఱకు దెచ్చినయుత్తమాశ్వముల నన్నిటిని మిక్కిలి తక్కువవెలలకు తెలంగానారాజు బలాత్కారముగా గైకొనియె నని మొఱపెట్ట నత డుగ్రుండై మఱియొకమారు వానిపై దండెత్తి పగదీర్చుకొనవలయు నని ప్రతిజ్ఞజేసి రాజ్యభారమును మల్లిక్ సైయఫద్ దీన్‌ఘోరీ యనువానిపై బెట్టి సుల్తాను పురమున కేగి తనసైన్యములను పదిదినములవఱకు బరీక్షించెను. తనకు విజయము కలుగుటకై యచట పవిత్రుం డైనమహమ్మదుసీరాజుద్దీన్ జనుదీ యనువానిచే బ్రార్థనలు చేయించి పదునొకండవదినమున నచటనుండి బహుసైన్యములతో దండయాత్ర వెడలి కళ్యాణపట్టణము బ్రవేశించెను. ఇంతనెమ్మదిగ బ్రయాణము చేసినయెడల బండ్రెండుమాసములకైన నోరుగల్లుచేరుట సంభవింప దని విశ్వాసపాత్రులగుమిత్రులు చెప్పగా మహమ్మదుషాహ యాసైన్యముల