పుట:Andhrulacharitramu-part3.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హించి మహమ్మదుషాహ హిందూరాజులను సంతోషపెట్టి కాలహరణము చేయుటకై విశ్వాసపాత్రులైన తనరాయబారులను గొందఱను వారలకడకు బంపించి యాహిందూ రాయబారులను పదునెనిమిదిమాసములవఱకు దనకొల్వుకూటములోనే యుంచుకొని యుండెను. ఈలోపుగా విశ్వాసఘాతకులని యనుమానింపబడినవారి నెల్లరను వారియుద్యోగములనుండి తొలగించి విశ్వాసపాత్రులైనవారిని నాయుద్యోగపదవులయం దుంచెను. వానితల్లియు బుణ్యక్షేత్ర యాత్రలు ముగించి స్వస్థానమునకు మరలి వచ్చెను. తరువాత మహమ్మదుషాహ యుద్ధముచేయ నిశ్చయించి ధనకనక వస్తువాహనాదులతో దమకడనున్న యేనుగులపై బెట్టి కాన్కగా బంపకున్న దండెత్తి వచ్చెద నని తనశత్రురాజులకు సమాచార మంపెను. అందుమీద అనపోతానాయడు తనకుమారునికి గొంతసైన్యము నిచ్చి వానిపైకి బంపించెను. విద్యానగరాధీశ్వరు డైనబుక్కరాజును కొంతసైన్యమును తోడుగా బంపించెను. ఈసైన్యముల నెదుర్కొనుటకై మహమ్మదుషాహసైన్యాధిపతి యగుబహదూర్ ఖాను నియమింపబడియెను. అసంఖ్యాకము లగుసైన్యములతో బహదూర్ ఖాను హిందూసైన్యముల మార్కొని యోడించి యోరుగల్లువఱకు దేశమును దోచుకొనుచు వచ్చుచున్నం