పుట:Andhrulacharitramu-part3.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నచట నిలిపి నాలుగువేలగుఱ్ఱపురౌతులతో దాను బయలుదేఱి వారముదినములకు నోరుగల్లుదుర్గమును సమీపించెను. అత డచ్చట కాబూలివాండ్రను గొందఱను రప్పించి గుఱ్ఱములవ్యాపారము చేయువర్తకు లనుకొనునట్లుగా నటించుచు మార్గములో దొంగలు కొట్టి దోచుకున్నట్లుగా వేషములు వేసికొని మీరు తిన్నగా బోయి దుర్గద్వారము కడనున్న కావలివాండ్రను నేమరించి సంభాషించుచుండవలసినదని వారల కాజ్ఞాపించెను. వానియాజ్ఞను శిరసావహించి వారట్లు పోయి దుర్గద్వారముగుండ లోనికిం బోవ బ్రయత్నింప రక్షకభటులు వారలను బోనీయక నిలువరించిరి. తమ్ము దారిలో దొంగలు కొట్టి దోచుకున్నందున మహారాజునకు జెప్పి సంరక్షణము బడయవలయునని వచ్చితిమేకాని వేఱొండుకాదని వారలు ప్రత్యుత్తర మిచ్చుచుండ మహమ్మదుషాహ నాలుగువేలగుఱ్ఱపుదళముతో వచ్చి పైబడియెను. రక్షకభటులు ద్వారముతలుపులు మూయ బ్రయత్నించిరిగాని ప్రచ్ఛన్నవేషములతో నున్న యాఫ్‌ఘన్‌భటులు తలుపులు మూయకుండ నడ్డుపడిరి. తురుష్కాశ్విక సైనికులు కావలివాండ్రనెల్లరను సంహరించి భయంకరధ్వనులతో లోనం బ్రవేశించి నగరములో నున్ననిరపరాధులైన ప్రజల నురుమాడుచు గ్రూరసంహారమున కొడిగట్టి విజృంభించి వచ్చుచుండగా దుర్గాధ్యక్షు డైన