పుట:Andhrulacharitramu-part3.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుద్ధము జరిగి యోరుగంటిరణక్షేత్రమున రక్త కాల్వలు ప్రవహించిన వన్న నతిశయోక్తి కాదు. సుస్థిరచిత్తుడై ప్రతాపరుద్రుని పుత్త్రుడు యుద్ధరంగమున నిలువంబడి యసంఖ్యాకములగు హిందూ సైన్యములను బురికొల్పుచు బెక్కుదినములు విడువక పోరాటంజేసి తురుష్క సైన్యంబులు నిరుత్సాహముం జెందుటయు, నందువలన విశేషముగా హతమగుట సంభవించెను. తుదకు ఇమ్మదు-ఉల్-ముల్కు హతశేషమగు సైన్యముతో నోరుగల్లు విడిచి పాఱిపోయెను. ప్రతాపరుద్రుని పుత్త్రుడు వాని వెన్నంటి దఱిమెను. అతడు దౌలతాబా దను నూత్ననామమును వహించిన దేవగిరిపట్టణమునకు బారిపోయెను. అంతట గాకతీయుడు హిందూ సైన్యములను మరలించుకొని యేకశిలానగరమున బ్రవేశించి పట్టాభిషిక్తుడయ్యెను. ఈ సమాచారము తెలియవచ్చిన తోడనే డిల్లీ చక్రవర్తియగు మహమ్మదు తుఘ్‌లఖ్ చిత్తచాంచల్యము గలవాడై పూర్వముకంటెను క్రూరుడై ప్రజల నానావిధముల బాధించుచు డిల్లీ నగరవాసులను దౌలతాబాదునకు బోయి కాపురముండునటులు నిర్భందపఱుసాగెను. డిల్లీ నగరమునుండి దౌలతాబాదునకును దౌలతాబాదునుండి డిల్లీ నగరముకును బ్రజల నినుమాఱు ద్రిప్పియు దుదకు విఫల ప్రయత్నుడయ్యెను. ఈ దెబ్బతో దక్కను దేశమునందు