పుట:Andhraveerulupar025958mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కందకములను బూడ్పించి రాజధానినంతయు దగులబెట్టించి యుపవనముల రూపుమాపి నగరమును బాడుచేసెను. తల దాచుకొనుటకు దావులేక భీమరాజు అంత:పుర కాంతలతో దోబుట్టువులతో రక్తసంబంధులతో నెందోపాఱిపోయి రుద్రదేవుని పేరు వినబడినంతవఱకు దలయెత్త డయ్యెను. అంతలో కందూరు వర్థమానపుర రాజ్యములు రుద్రదేవుని హస్తగతములయ్యెను.

చోడోదయుడను నొకరాజు విస్తార సైనికబలముతో స్వతంత్రుడై తిరుగబడగా రుద్రదేవు డాతనినగరమును ముట్టడించెను. అనుమకొండ సైనికులు చోడోదయుని నగరమును ధ్వంసము గావించిరి. రుద్రదేవుడు బాణముల బ్రయోగించి చోడోదయుని దేహమంతయు గాయములతో నిండునట్లు చేసెను. ఆయువుపట్లలో బాణములు గ్రుచ్చుకొనుటచే జోడోదయు డొడలెఱుంగక రాజమందిరము విడిచి కానల వెంటబడి ప్రాణములు విడిచెను. సమర్థులగు రాజులందఱు రుద్రదేవునకు సామంతులైరి. మహాదేవరాయలు రుద్రదేవుని యసాధారణ పరాక్రమమునకు ముగ్దుడై ద్వేషము మాని కార్యాలోచనములం దన్నతో సర్వవిధముల నేకీభవించు చుండెను.

రుద్రదేవుడు పరాక్రమాతిశయముచే ఆంధ్రదేశమంతయు నాక్రమించుకొనెను. అంతియగాక కర్ణాటదేశము నందలి