పుట:Andhraveerulupar025958mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగములను ద్రవిడదేశములో గొంతభాగమును సరిహద్దులందున్న మహారాష్ట్రదేశమును సాధించెను. రుద్రదేవుని రాజ్యమునకు హద్దులు తూర్పుదిక్కున సముద్రమనియు, దక్షిణదిక్కున శ్రీశైలమనియు, బడమటిదిక్కున జాళుక్యరాజథాని యగు కల్యాణపురమనియు, ఉత్తరపుదిక్కున మాల్యవంతమనియు జెప్పబడెను. ఇంత విశాలరాజ్యమును బరాక్రమముచే నార్ఝించి శాశ్వతస్థాయిగా గాకతీయ సామ్రాజ్యమను పేర నిలిచియుండుటకు బాటుపడిన రుద్రదేవుని పవిత్రసంకల్పము సర్వజనసంభావనీయ మనుటలో సంశయము లేదు. ఈ వీరాధివీరుని పరిపాలనముతో బట్టు దప్పిన చాళుక్య చోడ రాజ్యము దాదాపుగ నంతరించెను.

రుద్రదేవుడు లలితకళలను మిగుల బ్రేమించి పోషించెను. అనుమకొండలో నపూర్వ శిల్పరమణీయమగు నొక దేవాలయము గట్టించి ముందు వేయిస్తంభములతో గొప్ప మండపము గట్టించెను. ఇపు డామండపము చాలవఱకు గూలి పోయినది. ఆలయముమాత్రము నేటికి దర్శనీయమై మనోహరముగ నున్నది. ద్వారములందు గల లతాచిత్రములు స్తంభములపై గల పురాణకథావిగ్రహములు జీవకళ లుట్టి పడుచు గనువిందు గూర్చుచున్నవి. నాడుపెట్టిన మెఱుగు నేటికి గొంచెమేని కనుమాయక యచ్చెరువు కలిగించుచున్నది. గర్భాలయ ద్వారబంధములపైగల శిల్పములు, విగ్ర