పుట:Andhraveerulupar025958mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నము శస్త్రవిద్యానైపుణ్యము గడించి సాటివారిలో సర్వవిధముల నెన్నికకెక్కి యౌవరాజ్యపట్టాభిషేకమునకు దగుప్రాయము గలవాడయ్యెను.

ప్రోలరాజు షట్కాలశివపూజానిరతుడు. స్వయంభూస్వామి యాలయమున కాత డొంటరిగా వచ్చి పూజాదికములు గావించిపోవు నాచారముగలదు. కొంత కాలమునకు స్వయం భూస్వామి యనుగ్రహమున వేఱొకకుమారుడు కలిగెను. వానికి మహాదేవరాయలని నామకరణము గావించి వాత్సల్యముతో బెంచుచుండెను. ఒకనాడు ప్రోలరాజు ప్రయాణము కానిశ్చయించి వేకువజామున లేచి పరివారముతో బయలుదేరి ద్వారమున ననుయాయులనుంచి తా నొక్కరుడ యీశ్వరసాన్నిధ్యమున కేగి పూజాదికములను శ్రద్ధాభక్తులతో నొనరింపదొడగెను. రాచనగరులో నుదయకాలమున మంగళగీతలు వినరాసాగెను. ప్రోలరాజు పూజాదికములు ముగించి శివనిర్మాల్యము గొనివచ్చుచుండ మండపమున నిదురించుచున్న యొక దివ్యమంగళవ్యక్తి గోచరించెను. ప్రోలరా జట గూర్చుండి యావ్యక్తిదివ్యాకారమును రూపరేఖావిలాసములు గాంచి యాశ్చర్యపడుచు దనలో దానుచింతించుచు దలయూపుచు నిశ్చేష్టుడై చాలసేపుగడపెను. తుదకు బ్రయాణ మనివార్యమగుటచే లేచి యావ్యక్తిని నొక్కమాఱు కౌగిలించుకొనిన గాని పోవజాలనని నిశ్చ