పుట:Andhraveerulupar025958mbp.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యించి తరంగముల వంటి బాహువులు సాగించి నిదురలో మైమఱచియున్న యావ్యక్తిని గౌగిలింప బోయెను. వెంటనే గాఢనిద్రలో నున్న యావ్యక్తి యులికిపడి లేచి విద్యుద్వేగమున బ్రోలరాజును కోశనిర్ముక్తమగు పదనుకత్తితో వక్షమునుండి యావలకు దూరునటుల బొడిచెను. వెంటనే వృద్ధుడగు ప్రోలరాజు మొదలు నరికిన కదళీతరువు వలె బడిపోయెను. గంటవలె వెలుగుచున్న దీపపు వెలుగున నావ్యక్తి తనకత్తి కెఱయైన పురుషుని బోల్చికొని ప్రోలరాజని గుర్తించి గుండెల బాదుకొనుచు "అన్యాయముగా రాజన్యుని జంపితిని. రాజద్రోహము గావించిన నాకిక నధోలోకమే శరణ్యము. ఎంత యనాలోచితమునకు బాల్పడితిని! నిద్రావస్థలో జోరుడని చేయిమిగిలితిని. ఈ పాపకార్యము రాజనగరమున నివేదించి దోషమునకు దగినశిక్ష నొందుదుగాక"యని యావ్యక్తి బయలు వెడలెను. ఈసమ్మర్దము నాలకించి ద్వారమున నిలిచియున్న పరివార మంతయు మహామండలేశ్వరుని సమీపించి యీ విపరీతావస్థగాంచి నివ్వెరపోయిరి. ప్రోలరాజు కొంతసేపటికి దెలివినొంది యూర్థ్వశ్వాసములచే మరణవేదన మొందుచుండ రాజకీయోద్యోగులు రాణివాసపు వారుగూడ నీకథవిని సంభర మముతో వచ్చి పలుదెఱంగుల వాపోవుచు ఖడ్గప్రహారము గావించిన నూతన వ్యక్తి జంప వలయుననియు గత్తికొక ఖండముగ జేయవలయు ననియు బలుక దొడగిరి. నోటమాట