పుట:Andhraveerulupar025958mbp.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవాహములతో నిండిపోవునటుల పెద్దవర్షము వచ్చెను. దిక్కటాహము లంధకార బంధురమయ్యెను. మాధవవర్మ యాప్రదర్శనములకు భయపడక నాటిరాత్రి యంతయు పద్మాక్షీ సమ్ముఖముననే గడుప నిశ్చయించి బీజాక్షరసంయుక్తములగు మహామంత్రముల మేఘరవము శ్రుతిజేసికొని పఠింపదొడంగెను. ధ్యాన నిశ్చలుడగు మాధవవర్మ హృదయస్థిమితమును బ్రళయకాల ఘనాఘన గర్జనములు గాని యేకాంతవాసము గాని భీమాంధకారస్తోమము గాని చలింప జేయ లేకపోయెను.

సమీపమున గుహలన్నియు జనస్తోమముచే నిబిడీకృతములై యుండెగాని స్థిరబుద్ధితోనున్న మాధవవర్మ కాయరిము తెలియదు. తెలిసికొనవలసిన యావశ్యకము సైతము లేదు. ఆవీరుని స్థిరబుద్ధికిమెచ్చి పద్మాక్షీదేవి ప్రత్యక్షమై "కుమారా! నీతపమున కానందించితిని. నీస్థిరదీక్షకు మెచ్చికొంటిని. నీవు బాల్యమునుండియు బ్రాహ్మణధర్మముల యందాఱితేఱిన మాధవశర్మ గృహమున బెఱిగియుంటచే సహమగు క్షత్రియధర్మములయందు బరిశ్రమ గావింపకున్నాడవు. నీజనకుడు బల్లహునితో బోరాడి రణరంగమున నిషతుడయ్యెను. జననియగు సిరియాలదేవి నా నావస్థకులోనై తన వేకటిని గాపాడుకొని పసివాడగు నీక్షేమము నపేక్షించుచు బరులపంచలలో బడియున్నది. స్వరాజ్యమగు కందార