పుట:Andhraveerulupar025958mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాధవశర్మ కుమారునకు స్వయముగా నైదవయేట నక్షరాభ్యాసము గావించెను. మేధాశాలియగు నాకుమారుడు మిగుల బుద్ధికుశలతతో స్వల్పకాలములోనె సర్వశాస్త్రములు పఠించెను. అమోఘ విద్యాధురీణుడగు మాదవశర్మ బోధన మహిమచే మాధవవర్మ కొన్నికొన్ని శాస్త్రములలో దేశికునకుసైతము సందేహములు తీర్ప సమర్థుడయ్యెను. సమయానుసారముగ గరిడిసాలలకేగి లక్ష్య విద్య నేర్చెను. వ్యూహనిర్మాణము, దుర్గభేదనము, కవచధారణము లోనగు సంగ్రామరహస్యములు స్వయముగానే యాతడు నేర్చికొనెను. హనుమకొండ పురముననున్న దేవళములలో బద్మాక్షి దేవ్యాలయము ప్రశంసా పాత్రమైనది. పద్మాక్షిదేవి ప్రత్యక్షదేవత, ఆయమ యనుగ్రహముచే నభీష్టసిద్ధి నొందని పౌరులులేరు. దూరదేశవాసులు సైత మాయమ యనుగ్రహము నపేక్షించి యాలయప్రాంతమున దవముగావించు నాచార మాకాలమున గలదు. మాధవవర్మ మాధవశర్మవలన నుపదేశమైన మహా మంత్రరాజములు పురశ్చరణము గావించుటకై శైలమేఖలయందున్న పద్మాక్షీ నికేతనమున కేగి నిత్యము గొంతకాలము కాలక్షేపము జేయుచుండెను. స్థిరసంకల్పము గల మాధవవర్మ యొకనాటి సాయంత్రము యధావిధి పద్మాక్షీసముఖమున కొకడ యేగి ధ్యానమున మైమఱచెను. ఆకసమునిండ మేఘములాక్రమించి భూనభోంతరములు జల