పుట:Andhraveerulupar025958mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున కీవేగనర్హుండవు. ఇదిగో ఖడ్గఖేటంబులను స్వీకరింపుము. దివ్యాయుధములగు వీని సహాయముచే నీవు విశాలమగు రాజ్యమును బాలించి పితృరాజ్యమును హరించిన కటకేశ్వరుని వధింపగలవని యానతిచ్చి యంతర్ధానమయ్యెను.

మాధవవర్మ యపరమితానందభరితుడై యాఖడ్గఖేటకముల బరిగ్రహించి దేవీమూర్తికి బున:పున:ప్రణామముల నాచరించి యాలయమును వదలి బయటికి వచ్చెను. విశాలాకాశమున నావరించిన జలదములు విచ్చిపోయెను. సోముడాకాశమధ్యభాగమున బ్రకాశించుచుండెను. అవ్యక్తస్వరములతో గీటకములు రొదచేయుచుండెను. కల్మషజలముచే నావరింపబడిన పల్వలములలో జంద్రునికిరణములు ప్రతిఫలించి యమోఘకాంతి నిస్తంద్రములై యలరారుచుండెను. మనోహరమగు నాప్రకృతిప్రపంచమును సవిమర్శముగ దిలకించుచు బద్మాక్షియనుగ్రహమునకు మిగుల నానందించుచు నట విశ్రమించెను. సమీప గుహాముఖమునుండి మనుష్యసంభాషణము వినవచ్చెను. మాధవవర్మ యదియు బద్మాక్షీమాహాత్మ్యముగా నూహించి యభయకరములగు నాయుధఖేటకములను గొని యా గుహాముఖమున బ్రవేశించి నలుగెలంకుల దిలకించెను. ముందు కొందఱు గుంపుగా గూడియుండిరి. మాధవవర్మ వారినిజూచి "మీరెవరు? ఇటకు రాగతమేమి?" యని ప్రశ్నింప వారలందఱు తాము కందార వాస్తవ్యులమనియు సోమదేవుడు గతిం