పుట:Andhraveerulupar025958mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాప్రేమబంధము త్రెంచుకొన లేక చాలసేపు పరాధీనహృదయముతో వర్తించిరి. ఇంతలో ద్వారమున బ్రతికూలసైనికుల యట్టహాసములు వినవచ్చుచుండెను.

సోమరాజు సానకంపముగ బ్రియురాలిని సందర్శించి "యువతీమణీ! సంగరరంగమునకు బోవలసిన తరుణ మాసన్నమైనది విజయముపై నాసలేదు. పగతురచే జనిపోవుట నిశ్చయము. నీ సంతానము కొఱకు బరమందున సైతము నాయాత్మ ప్రతీక్షించుచుండును. సహగమన మాచరింపకుము సుమా!" యని సంగరరంగమున కుఱుకబోయెను. సిరియాలదేవి హృదయము నీరయ్యెను. ఆయమ్మ కనుగొలకులనుండి వేడి వేడి యశ్రువులు రాలుచుండెను. పెదవి కంపింపసాగెను. శోకావేశభరమున బ్రియుని గాడముగ గౌగిలించుకొని మైమఱచెను. వీరకర్మమున కుఱుకనున్న సోమరాజు కూడ జాలసేపు స్తబ్ధుడై యూఱకుండెను. తరువాత నంతరాత్మచే బ్రబోధితుడై పరవశురాలైన ధర్మపత్నిని మెల్లంగ వదలి రణరంగము ప్రవేశించెను. సోమరాజు సంగరరంగమున బ్రవేశించుటగాంచి ద్విగుణీకృతమగు సాహసముతో భటులు, మంత్రులు, పౌరులు వీరావేశమున ముందునకు దుమికిరి. తిమింగిల సంచలనముచే సముద్ర మాక్షోభించునటుల గటకేశ్వరుని సైన్యము సోమభూపాలుని సైన్యపు దాకిడికి గలగిపోయెను. అసంఖ్యాక పదాతి పరివేష్టితమగు కటకే