పుట:Andhraveerulupar025958mbp.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నారు. ప్రతిపక్షులు కోటలో బ్రవేశించుటకు ముందు నీవొత్మ సంరక్షనము గావించి కొనుట విధి. అపజయము కొలదికాలములో మనల నావరింప నున్నది. మన నోముల పంటయగు నీభ్రూణము కాపాడుకొనుట నీవిధి. ముందు నీ వీయంత:వురమును దాటి విశ్వాసప్రాతులగు భృత్యులగొని దేశాంతరములు చేరుము. ఏచెట్టుక్రిందననేని తలదాచుకొమ్ము. నీగర్భమున జన్మించు శిశువు మన కుభయులకే గాక వంశమున కంతటికి బ్రతిష్టదెచ్చి పరమందు బరాజయ చింతతో నధోలోకమునకు జేరనున్న మన యాత్మలకు శాంతి గూర్చుటకై కతకేశ్వరుని వధింప గలడు. ఇది వేద వేద్దంగవిదులగు బ్రహ్మజ్ఞలలు వాక్య 'మని సోమరాజు తెలిపి యావల మాటలాడలేక పోయెను. సిరియాలదేవి హృదయమ తారుమారయ్యెను. శుభచిహ్నముగ భావించి గర్భరణమునుగూర్చి యామె యెంత యానందించెసియిపు డంత విచారపడవలసి వచ్చెను. భర్తతో సమానముగ బరముజేర ననుకూలమగు సహగమనము గావించుటకు నాయమకు స్వతంత్రము లేదయ్యెను. నిరాశావృత మగు నాయమహృదయదృష్టికి బాహ్యప్రపంచమంతయు నంధకారబంధురముగా గానరా దొడంగెను. మాఱుపలుకక సిరియాలదేవి కనుల నీరుగార్చుచు డల నేలకు వ్రాలినిలిచెను. ప్రేమచ్చేదనము మిగుల కృపణ కార్యము. దంపతు