పుట:Andhraveerulupar025958mbp.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కటకేశ్వరునకు బ్రబలప్రత్యర్థినియగు నీసిరియాలదేవి నెవరు చేరదీసి యవస్థలపాలగుట కియ్యకొందురు? అభిమానమువదలి కటకేశ్వరుని శరణుగోరుట కాయమపవిత్రహృదయ మంగీకరించునా ? సత్సంతానార్థియగు సోమరాజుమాత్రము తన ధర్మపత్ని కట్టియాజ్ఞ యొసంగలేదు. సిరియాలదేవికి దలదాచుకొన నెలవు కానరాదయ్యెను. ఎఱుకురాజను పరాక్రమశాలి పరిపాలించు హనుమకొండ కేగిన బ్రతుకవచ్చుగదా యని పరిచరులను వెంటగొని మాఱు త్రోవలబట్టి కొలది కాలమువకు హనుమకొండ జేరెను.

పరిచారకు లిరువురు సిరియాలదేవి నొకపాడుపడిన దేవళముచెంత నుంచి తా మెఱుకుదేవరాజు చెంతకేగి కటకేశ్వరుని దురంతమునంతయు నివేదించి గర్భభారాలస యగు సిరియాలదేవి కాశ్రయము నొసంగవలయునని సహస్రభంగుల బ్రార్థించిరి. సహజభీరువగు నెఱుకురాజు కటకేశ్వరుని ధాటికి వెఱచి తన రాజ్యమున నాయమనుంచుకొన వీలుకాదని ఖండితముగ బోధించెను. పరిచారకులు మిగుల దైన్యముగనున్న యామ జీవితచరిత్రము నంతయు నివేదించి ప్రసూతి పర్యంతమైన నిలువనీడ నీరాజ్యమున నొసంగుమని వేడికొన విధిలేక సోమరాజువలన దానొందిన లాభముల స్మరించికొని యంత:పురములో నుండ వీలుగాదనియు గ్రామములో నెచటనేని జీవితము గడుపుకొనుచో నభ్యంతరము లేదనియు నెట్టకేల