పుట:Andhraveerulupar025958mbp.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెవరిని తిరస్కార వాక్యముల నాడి తిరుగుబాటు చేయుటకు గొంతసైన్యమును సమకూర్చెను. పూర్వాభిమానము జ్యాతిభిమానముగల నాల్గువేలమంది రాచవారు స్వాతంత్ర్యసంగరమున బ్రాణముల వదలుటకు నిశ్చయించి విజయరామరాజు పక్షమున జేరిరి. రాచవారందఱను బద్మనాభస్వామి దేవళమున సంగరమున బ్రాణమున్నంతవఱకు బాల్గొన వాగ్దానము లొనరించి ప్రసాదమును స్వీకరించిరి. పైవారి యుత్తరువుచొప్పున ఆంగ్లేయ సైనికాధిపతియగు పెండరుగాష్టుగారు సుశిక్షితులగు నేడువందల యేబదిమంది భటులతో (క్రీ.శ. 1794 సం|| జూలయి 10 తేదికి) సూర్యోదయమగుసమయమునకు బద్మనాభమునకు జేరిరి. ఉభయులకు సంధికి వీలుకాకపోయెను. విజయరామరాజు స్వాతంత్ర్యము కోలుపోవుట కించుకేని యంగీకరింపక భటులను సంగరమునకు బురికొల్పి తానును ప్రతిపక్ష సైనికుల నెదిరింప బయలువెడలెను. ఉభయదళములకు ముప్పావుగంటసేపు ఘోరముగా యుద్ధముజరిగెను.

విజయరామరాజువెంట అంగరక్షకులుగా విజయగోపాలరాజు, వత్సవాయినరసరాజు, దాట్ల అప్పలరాజు, రావు జోగయ్య మొదలగు వీరులు పరివారముతోనుండి ఆంగ్లసైన్యమును భేధించుటకు ముందునకు ద్రోవతీయుచుండిరి. అందఱికంటె ముందు దావతుఖాన్ అను యవనుడు సైన్య