పుట:Andhraveerulupar025958mbp.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేష్కషులు పరిష్కరింపనెంచి యందఱ నాహ్వానించిరి. పలువురు పరిష్కారార్థము వచ్చిరి. సీతారామరాజు ఈనిర్ణయమునకు దానుగూడ మదరాసునకు వచ్చి దొరతనమువారి యాశ్రయమును సంపాదించుకొని మరల మంత్రియయ్యెను. సీతారామరాజు మంత్రియైనచో మఱలనేమి కల్లోలములు జనించునోయని విజయరామరాజు తొలుత సంశయించెనుగాని ఈనిర్ణయము కంపెనీవారు కావించినదిగాన నాయన యేమియు జెప్పజాలక యంగీకరించెను. సీతారామరాజు నిరంకుశాధి కారముతో రాజ్యచక్రము త్రిప్పుచుండెను. హవేలీ భూము లన్నియు నీయనకు గౌలుగా నుంటచే బలుకుబడి కూడ మిక్కుటముగా నుండెను. మరల బ్రజాపీడనము గావింప మొదలుపెట్టెను. అడ్డుపడిన తమ కెట్టి తిరుగుబాటు కలుగునోయని దొరతనమువారు తటస్థముగా నుండిరి. ఈ యవకాశమును బురస్కరించుకొని సీతారామరాజు మిక్కిలి చొరవజేయుచుండెను. దొరతనమువారు సీతారామరాజు విషయములో నుపేక్షించిన లాభములేదని క్రీ.శ. 1784 లో నొక ఉపసంఘము నేర్పఱచి ప్రకృత పరిపాలనా విధానమునందు బ్రజాభిప్రాయములు నివేదింప నాజ్ఞాపించిరి. వారు విచారించి యీక్రింది యభిప్రాయముగల నివేదికను బ్రచురించిరి. "విజయనగరము సంస్థానమువలన వచ్చు ఆదాయ మంతయు జమీందారులు తమ స్వంతఖర్చుల కే వ్యయము గావించుకొను