పుట:Andhraveerulupar025958mbp.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విడిగ నాగ్నేయగుళికల గ్రుమ్మరింపసాగిరి. పేరుజెందిన యాంధ్రవీరు లనేకులు కరవాలము లుభయహస్తముల గీలించి మార్తుర బలములతో దలపడి ఘోరసంగ్రామము గావించిరి. ఆనాడాంధ్రులు చూపిన యద్భుతవిక్రమమున కనపోతరా జాశ్చర్యము నొంది తానొక యున్నతాశ్వము నెక్కి సైనికుల కుచితధర్మము నెఱింగించుచు బ్రతిపక్షసైన్యముల నురుమాడించుచుండెను. ఆంధ్రులధాటి కాగలేక యవనసైన్యమంతయు ఱాతిపైబడిన గోలికాయలవలె తలకొక త్రోవను బాఱిపోయిరి. అనపోతనాయడు స్వయముగ మహమ్మదుషాహ నెదిరించి యాతనితో జాలసేపు పోరాడెను. అనపోతనాయనిచే మరణముదప్పదని యాతడు నిశ్చయించి కొని ప్రాణముపై దీపిచే బాఱిపోయెను. ఆంధ్రసామ్రాజ్యమునకు విజయార్థమరుదెంచి పరాభవము గడించినందులకు గుర్తుగ మహమ్మదుషాహశరీరముపై ననపోతరాజన్యుడు రెండుమూడు బలమైనగాయములు చేసి పాఱిపోవువానిని వధించుట మగటిమికాదని వెనుకకుమరలెను. మహమ్మదుషాహ చావగామిగిలిన పదునైదువందల సైనికులతో దలప్రాణముతోక బట్టగా గలుబరగపురమునకు బరాభవరూపమగు నభాగ్యదేవతతో గూడ బ్రవేశించెను.

చెప్పరాని పరాభవముతో గలుబరగ జేరియు మహమ్మదుషాహ మఱల నాంధ్రనగరమును ముట్టడింప బలంబుల