పుట:Andhraveerulupar025958mbp.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయితము చేయుచుండెను. కలుబరగ బహమనీవంశము నిర్మూలముగావింపకున్న నేసమయమున నేయపాయము కలుగునో యని యనపోతనాయడు చాలతడవు విచారించి డిల్లి చక్రవర్తిగానున్న ఫిరోజీషాహకడ కొకరాయబారము పంపెను. రాయబారులు డిల్లినగరమున కేగి ఫిరోజిషాహాను దర్శించి బహమనీ రాజ్యము నంతమొందించి కలబరగ డిల్లిలో గలుపుకొందురేని యనపోతభూపాలుడు మీకు సర్వబలములతో సహాయము రానున్నా" డనియు లేక మీ రుచితబలముల బంపుదురేని తనబలములతోగూడ ననపోతభూపాలుడు సంగరకార్యము నిర్వహించు'ననియు విన్నవించిరి. నవా బపుడు కుటుంబకలహములలో మగ్నుడైయుంటచే గర్తవ్యశూన్యుడై రాయబారులకు బ్రత్యుత్తరము నొసంగక ప్రకృతము తానా యుభయమార్గముల నంగీకరింప జాలడనియు బరులకు సహాయము గావింపదగినంతబలము తనచెంతలేదనియు దమరాజుతో దెలుపుమని మాత్రముచెప్పెను. రాయబారులు నిరుత్సాహముతో నాంధ్రనగరమునకేగి జరిగినయంశము నంతయు ననపోతభూపాలున కెఱింగించిరి.

అనపోతనాయడు డిల్లినవాబుతో మంత్రాంగము చేయుచున్న సంగతి గూడచారులవలన మహమ్మదుషాహ యాలకించి కోపము నొందినవాడై యనపోతరాయని రాజ్యచ్యుతుని గావించుటయో యతనిచే నంతరించుటయో కర్తవ్య