పుట:Andhraveerulupar025958mbp.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని యమితబలసమన్వితుడై యేకశిలానగరమునకు దాడి వెడల యత్నించి తనయావద్బలమును రెండుగా విభజించి యం దొకభాగమును "అజీము హుమాయూన్" అనువాని యాధిపత్యముతో విదర్భదేశమును ముట్టడింప బంపి మిగిలిన సగముబలమునకు సరదరుఖానుని యధ్యక్షునిగావించి యాతనివెంటనే తాను స్వయముగా నోరుగంటికి బయనమయ్యెను. ఈసమయమున మునుపటివలెనే సయఫియుద్దీనుగోరీయే సైన్యాదికముల స్వల్పముగా నుంచికొని కలబరగ దుర్గము గాపాడుచుండెను. మహమ్మదీయబలము కొంతకాలమునకు ఒరంగల్లుచేరెను.

యవనబలము లాకస్మికముగ నోరుగల్లు ప్రవేశించు వఱ కచట తగినంతమంది సైనికులు లేకుండిరి. ఒకపద్మనాయక వీరుడుమాత్రము ద్వారమును గొలదిబలముతో గాచుకొనియుండెను. సైనికులందఱు ననపోతనాయనివెంట గొండవీటిరెడ్డిరాజుల బ్రతిఘటించుటకై ధరణికోటప్రాంతముల కేగియుండిరి. మహమ్మదీయులు స్వల్పబలముతోనున్న యేకశిలానగరము నవలీలభేదించి యేయాటంకము లేకుండ లోనబ్రవేశించిరి. మహమ్మదీయులు రాజ్యమునబ్రవేశించి యనేక దురంతముల గావించిరి. వేగులవా రీయుదంతము నంతయు ధరణికోట కేగి యనపోతనాయని కెఱింగించిరి. వెంటనే యనపోతనాయడులికిపడి రెడ్డివారితో నెటులొ సంధిగా