పుట:Andhraveerulupar025958mbp.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండ నొల్లని స్వతంత్ర శీలురగు రాచవారు, కమ్మవారు, రెడ్డివారు జల్లెపల్లి రాచవారికి సైన్యముతో నేతెంచి తోడ్పడిరి.ఉభయ వీరులు సంగ్రామమునకు జెంజెర్ల ప్రాంతము రంగస్థలముగా నిర్ణయించు కొనిరి.

జల్లెపల్లి దుర్గాధీశ్వరులగు చంద్రవంశ చాళుక్య రాజుల పక్షమున గోన మల్లారెడ్డి, మంగళపూడి యిమ్మడిరెడ్డి, రావులవరపు మల్లారెడ్డి, పోలూరి పోలారెడ్డి, బండికోటారెడ్డి, వినుకొండ మారారెడ్డి, కుంట్లూరు మారారెడ్డి, అరవపల్లి గౌరిరెడ్డి, కొత్తపల్లికొండారెడ్డి, గౌరారెడ్డి, నాగారెడ్డి, కొలెచెలమకొండ మాచారెడ్డి మొదలగు రెడ్డిరాజులను రామగిరి దుర్గపరిపాలకులును అనంతగిరి, కందికొండ, జమ్మిలోయలోనగు రెండువందలదుర్గముల బరిపాలించు సామంతులును సైన్యముతో వెలమసైనికుల బ్రతిఘటించుటకై తలపడిరి. జల్లెపల్లి రాచవారందఱు మూలబలముల నన్నింటిని మొగలూరు దుర్గమున సురక్షితముగ నుంచుకొని మిగుల సాహస విక్రమములతో వెలమవారి సైన్యమును బ్రతిఘటించిరి. ఇరువాగులవారి కింతయనరాని నష్టముకలిగెను. వీరవర్యులనేకులు గతించిరి. సంగరరంగ మంతయు రక్తప్రవాహముచే బంకిలమయ్యెను. ప్రతిపక్షుల హేతిఘాతములకు జంకక వెలమవారి సైన్యములు మృత్యు దేవతా వదనగహ్వరమును జొచ్చినటుల జగతుర సేనలో జొఱబడి నుగ్గు నూచము గావించిరి. రాచవారి