పుట:Andhraveerulupar025958mbp.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పాలనము గావించుటయో, శక్తిలేకున్న ఘోరసంగ్రామమున శక్తియున్నంతవరకు బోరి మరణించుటయో కర్తవ్యమని వారికి దోచెను. బ్రతుకుపై నిరాశ జనించెను. పేరుజెందిన శూరలంద ఱాసమయమున నాకుమార రాజన్యుల సమ్ముఖమున కేతెంచి బుజ్జగించి 'మేమందఱము చంపను జావను సర్వ సిద్ధముగా నున్నారము. సింగమనాయడు మీకు జనకుడు, మాకు బాలకుడుగావున నాతనియాజ్ఞపాటించుట మనయందఱకు సమానధర్మము గావున మీరు నాయకత్వము వహింపుడు. ఇపుడు రాచవారిమారణమున కుపక్రమింత' మని హెచ్చరించిరి. కర్తవ్యము నారయు నాకుమారు లత్యుత్సాహముతో దండ్రికి దహనాది సంస్కారములు గావించి సైనికుల నందఱ సమావేశపఱచి పిత్రాజ్ఞ నివేదించిరి. స్వామిభక్తి పరాయణులగు నాయాంధ్రవీరు లందఱు కరవాలముల జళిపించుచు దమ యంగీకారములను వెల్లడించిరి.

స్వల్పకాలమునకె దేవరకొండ, రాచకొండలలో నున్న మూలబల మంతయు రప్పింపబడెను. జల్లెపల్లి ప్రాంత మంతయు వెలమవీరుల సైన్యముతో నేల యీనినటు లుండెను. జల్లెపల్లిలోని క్షత్రియులగుండె లదరెను. విజయముపై నాస తొలంగెను. ఐనను శక్తికొలది పోరాడి సంగ్రామరంగమున మరణించుటయే యిహపరసాధకమని భావించి వారును సంగరమున కాయితమైరి. సింగమనాయని యాజమాన్యము క్రింద