పుట:Andhraveerulupar025958mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సైనికులు వెలమసైనికుల కెందును దీసిపోక విక్రమముతో బ్రతిఘటించిరి. యుద్ధము చాల విరామముగ జరిగినను జయాపజయములు నిర్ణయింప నసాధ్యమయ్యెను. పిత్రాజ్ఞను నెఱవేర్ప కుండగనే యంతరించుట తమకు గర్తవ్యము కాదని యారాజుసోదరులు భావించి సైనికుల బేరు పేరు వరుసల బిల్చి బహుకరించి యిటులనిరి: 'పదాతులారా! మిమ్ము వేల్పులు స్వర్గద్వారములు తెఱచి సగౌరవముగ నాహ్వానించు చున్నారు. సూర్యమండలము మీకు స్వాగతము నొసంగుచు దన సొరంగములనుండి మిమ్ము స్వర్గలోకము జేర్పగలదు. కాని రాచవారి రక్తముచే బితృదర్పణములు మేమొనరింపక ముందు బరముననున్న సింగమనాయని సందర్శించుటకంటె నక్రమము వేఱులేదు. మీపై గర్తవ్యభారము మిక్కుటముగా గలదు. పగతురవధించి మా యుద్యమము గట్టెక్కింప వలయును. లేదా వంశాంకురమైన లేకుండ మనమందఱము గతింపవలయును." ఈవాక్యములు వినగనే ప్రతిపక్షులు చలించిరి. వెలమవారి సైనికు లినుమడించిన యుత్సాహముతో బ్రతిపక్షులబలములను జిందరవందర గావించుచు వీరవిహారము గావింపసాగిరి. సైనికులతో సమముగ రాజసోదరులుగూడ రణరంగమున కుఱికిరి.

కొంతకాలమునకు రాచవారి బలములన్నియు వినాశనము గావింపబడెను. పరాజయ భయముచేగొందఱు రాచ