పుట:Andhraveerulupar025958mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేవు పట్టణములని పేరొందిన గోవా పట్టణ మాకాలమున విదేశ వ్యాపారమున కాస్పదముగా నుండెను. విజయనగర సామ్రాజ్యమునకు ద్రవిడదేశమునందలి చాలభాగము బుక్కరాయని కాలమున లోబడియుండెను. మళయాళము, సింహళము లోనగు దూరదేశములను బాలించు రాజులుసైతము బుక్కరాయల ధాటికి వెఱచి యెప్పు డెట్టియపాయము గలుగునోయని సామంతులవలె రాయబారులచే వస్తువాహన రత్న సువర్ణాదులు కానుకగా బంపు చుండువారు.

బుక్కరాయలు సర్వసమత్వము, పాపభీతి, దైవభక్తి, పరోపకారబుద్ధిగల ఉత్తమగుణసంపన్నుడు. ఈయన శైవమతమునం దాదరభావము గలవాడైనను అన్యమత ద్వేషము లేక కాలము గడపెను. వైదికమతమునం దెక్కుడు అభిమానము గలవాడుగ నుండి విద్వాంసులగు బ్రాహ్మణులకు విశేషించి వృత్తుల నొసంగి మిక్కిలి యాదరించెను. బుక్కరాయలు సముద్రము, నాగవ్వచెఱువు, బచ్చప్ప చెఱువు లోనగు ప్రసిద్ధములగు తటాకముల నీనృపాలుడు నెలకొల్పి రాజ్యమునందు కఱవు లేకుండ జేసెను. బుక్కరాయలు కళింగదేశము, ఓడ్రదేశము గూడ జయించి మహేంద్రగిరివఱకు దండయాత్ర గావించి నటుల గొన్నిచోటుల జెప్పబడెను. ఈయన మంత్రులలోనొకడగు మల్లినాథు డనబడు భోజనమల్లుడు యవనుల జయించిన మహావీరుడు. విద్యానగర సామ్రాజ్య నిర్మా