పుట:Andhraveerulupar025958mbp.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల పవిత్ర జీవితములను బఠించు సందర్భమున సామ్రాజ్య స్థాపకుడును వైదికమతాభిమానియు అపరశంకరుడని ప్రశంసింపదగిన వాడును నగు మాధవవిద్యారణ్యులవారి జీవితము నెఱుంగుట చాల నవసరము.

మాధావాచార్యులు, సాయణాచార్యు లను నిరువురు సోదరులుగలరు. వీరు జగద్విఖ్యాతులగు విద్వాంసులు. వీరిది యజుర్వేదము, బోధాయన సూత్రము, భారద్వాజగోత్రము. యవనవ్యాప్తిచే దేశమందు అరాజకము ప్రబలి వైదికమతమునకు విప్లవము కలుగనుంటచే మాధవాచార్యులు హరిహరరాయ బుక్క రాయల బ్రోత్సహించి విద్యానగర రాజ్యమును స్థాపింప జేసెను. పేరునకు రాజులుగ నాసోదరరాజుల నుంచి రాజ్యచక్రము నంతయు మాధవాచార్యులే స్వయముగా బొంగరమును ద్రిప్పినటులద్రిప్పి మతధర్మములను గాపాడుటకు దన జీవితమునంతయు ధారపోసెను. మాధవాచార్యులు, సాయణాచార్యులు సంస్కృతములో సమస్తవిషయములందును గ్రంథములను రచించి గీర్వాణభారతి కఖండమగు సేవ గావించిరి. మాధవాచార్యులు సన్యాసము స్వీకరించి విద్యారణ్య స్వామియను నామాంతరము వహించి శృంగేరీపీఠమున కధ్యక్షుడయ్యెను. సన్యాసాశ్రమమునందు సైతము విద్యారణ్యులు విద్యానగర సామ్రాజ్యక్షేమమునకు బాటుపడు చుండెను. మాధవ విద్యారణ్యులవారు విద్యానగరమును బరి