పుట:Andhraveerulupar025958mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దము వహించెను. మహమ్మదీయులు మధురజయించి దేవళములు రూపుమాపుచుంటచే అర్చకులు శ్రీరంగములోని విగ్రహమునుదెచ్చి తిరుపతిలో దేవస్థానమునందు దాచిరి. ఈ సంగతి కంపభూపతి సేనానాయకుడును జెంజీసీమాపాలకుడును విష్ణుభక్తుడునగు గోపనార్యుడువిని తురుష్కుల బాఱదోలువఱ కావిగ్రహమును శృంగవరపు గోటయందు జేర్చి పూజించునటుల గట్టడిచేసెను. దేవాలయ ధ్వంసకుడగు మహమ్మదీయసేనాని మధురనుండి శ్రీరంగమునకు వచ్చి దేవళముననే బసగావించి కొన్నిదినముల కనారోగ్యముగా నుండి సమయవరమను గ్రామమునకు స్వల్పపరివారముతో నేగెను. అతని దుర్బలస్థితిని గనిపెట్టి గోపనార్యుడు చెంజి నుండి బయలువెడలి సంహరించి శ్రీరంగములో మఱల విగ్రహమును బ్రతిష్ఠించెను. ఈ మహమ్మదీయునకు వెఱచి సత్యమంగలమునందు దలదాచు కొనుచున్న వేదాంత దేశికులు శ్రీరంగమునకు వచ్చి తనకవితా కల్పనలచే గోపమంత్రిని సంతోష పఱచెను. కంపరాయలు గడించిన ప్రతివిజయమునందును గోపమంత్రియే గాక సాళ్వమంగు గూడనుండి యుండెను. సాళ్వమంగు ఆకాలమున బేరెన్నిక గన్నవీరులలో నొకడు. బుక్కరాయలటుల బుత్రుని సహాయమునం గూడ సామ్రాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ప్రసిద్ధి వహించిన వ్యాపార స్థలములను