పుట:Andhraveerulupar025958mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుచు జిరకాలము రాజ్యము పాలించెను. కొంతకాలము గడచినమీదట మహమ్మదుషాహ బుక్కరాయలు సంధిగావించికొని ఒకరి రాజ్యముపైకి వేఱొకరు రాకుండ గట్టడి గావించుకొనిరి. అదిమొదలు బుక్కరాయలు సరిహద్దులను గాపాడు యత్నముమాని తిరుగబడిన సామంతరాజుల పైకిని నూతన రాజ్యములమీదికిని దండయాత్రలకు బయలువెడలి కర్ణాటరాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను.

బుక్కరాయలు రాజ్యము పాలించుసమయమున నతని పెద్దకుమారుడగు కంపరాయలు పలుమాఱు విజయయాత్రల కేగి విజయలక్ష్మీ ద్వితీయుడై తిరిగివచ్చెను. దక్షిణదిశకు జైత్రయాత్రకేగుతఱి నీ నృపాలునివెంట గోపమంత్రియు, సాళువమంగరాజును సహాయులుగా నుండిరి. ద్రవిడదేశపాలకుడగు సాంపరాయలకును గంపభూపతి సైన్యమునకును గొప్పసంగరము జరిగెను. సాంపరాయ లమితబలముతో బాలేరు నాధారముచేసికొని ప్రతిపక్షసైన్యము నెదిరించెను. కంపరాయని సైన్యము సంగరమున నారితేరినదగుటచే ఉపాయాంతరములచే బాలేరుదాటి ఆకస్మికముగా బైనపడి ద్రవిడసైన్యమును దునుమాడెను. సాంపరాయలు వడవీడు దుర్గమునందు జేరెను. ధైర్యస్థైర్యములతో జిరకాలము పోరాడి కంపభూపాలుడు సాంపరాయలను వశపఱచికొని ఆతనిని సామంతునిగా నేర్పరచి సాంపరాయస్థాపనాచార్య బిరు