పుట:Andhraveerulupar025958mbp.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొందిరి. ఈయన రాజకీయ వ్యవహారములు ముగించికొన్న పిదప విశ్రాంతి కాలమునంతయు బండితులతో విద్యావినోదము లొనరించుచు గడపుచుండువాడు. రాజ్యమునందలి ప్రసిద్ధవిద్వాంసు లందఱు ఆస్థానమున కేతెంచి సాహిత్యవినోద ప్రసంగములతో గాలముగడుపు చుండువారు. ఆంధ్రకవులలో ప్రసిద్ధుడగు ఎఱ్ఱాప్రగడ మహాకవి వేమభూపాలుని యాస్థానమునందుండి తొలుత రామాయణము పద్యకావ్యముగా వ్రాసి యంకితము గావించెను. ఆ మహాకావ్యమునందలి పద్యములు కొన్ని లక్షణగ్రంథములందు మాత్రము కనుపించుచున్నవి. ఇపు డా గ్రంథరాజమెందును గోచరింపదనుట సంతాపకరము. ఎఱ్ఱాప్రగడగ్రంథములలో సమగ్రమైనది ఆంధ్రమహాభారతముతో అన్నివిధముల సమానముగా దులదూగ దగినది హరివంశము. ఇట్టి యుత్తమకావ్యమును ఎఱ్ఱాప్రగడ రచించి వేమభూపాలుని కంకితముగావించి యసమానకీర్తి కల్పించెను. ఎఱ్ఱాప్రగడవంటి మహాకవిచే నంకితము నొందగల్గిన వేమారెడ్డి సుకృతము ప్రశంసాపాత్రము. తనజీవితము వైదికధర్మ సంరక్షణము కొఱకును ధనమునంతయు రాజ్యస్థాపనము, చిత్రకళాపోషణము లోనగు సత్కార్యములకును, అవకాశము విశ్రాంతి ధర్మశాస్త్రాధ్యయనాదికములకు నుపయోగము, ఆంధ్రదేశ చరిత్రమునందు బ్రథమగణ్యుడైన వేమభూపాలుని చరిత్రము చాలవఱకు మఱపునకు వచ్చుచున్నదని తెలు