పుట:Andhraveerulupar025958mbp.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వృత్తుల నొసంగెను. అవచిదేవయసెట్టియను కోటీశ్వరుడగు వైశ్యుడు వేమారెడ్డికి సహకారిగను మిత్రుడుగా నుండి వలయు సమయముల నెంతయేని ధనసహాయము గావించుచుండెను. అవచిదేవుడు శివపూజా విధానమునందును అతిధిపూజా తత్పరత యందును దానధర్మ విధానమ లందును నిరుపమానుడై కీర్తిగడించెను.

వేమారెడ్డి విద్యాతపో వృద్ధులగు బ్రాహ్మణులకు బెక్కు లగ్రహారముల నొసంగెను. దేవాలయములు, తటాకములు ప్రతిష్టించి పరోపకారబుద్ధి ప్రకటించెను. చలివెందరలు, సత్రములు, తోటలు నెలకొల్పి సప్తసంతానముల బూర్తిచేసెను. ధర్మశాస్త్రములందు జెప్పబడిన సమస్తధర్మములు యధాశాస్త్రీయముగా గావించెను. తనయెడ భక్తిగలవాడై రాజ్యక్షేమమునకై పాటుబడుచున్న సోదరుడగు మల్లారెడ్డికి బుణ్యము కలుగునటుల అమరేశ్వరస్వామి దేవాలయ శిఖరముపై గనక కలశములను బ్రతిష్ఠించెను. వేమారెడ్డి పరిపాలనమం దెట్టి దండయాత్రలుగాని సంగరములుగాని లేకపోవుటచే ప్రజలు సుఖముగానుండిరి. సుంకములు, పన్నులు మిగుల స్వల్పముగ నుంటచే వ్యాపారము, వ్యవసాయము మిక్కిలి యభివృద్ధిలోనికి వచ్చెను.

వేమారెడ్డి కవితాగౌరవము గలవాడు. పలువురు కవులీనృపాలు నాశ్రయించి పద్యములు రచించి సత్కారముల