పుట:AndhraRachaitaluVol1.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిఘంటువు రచించిరి. అదిగాక వారు వేంకటాధ్వరి "విశ్వగుణాదర్శము" తెలుగు పఱిచిరి.కుమారుడు తండ్రిని మించిన పండితుడు.


ఈశా ద్యుపనిషత్తులకు దెలుగు పద్యములలో ననువాదము రంగాచార్యులు గావించిరి. అదిచూడ నబ్బురమగును. ఆపద్యముల పొందిక సుందరమైనది.


శా న్తి:|| పూర్ణమద:,పూర్ణమిదం,పూర్ణా త్పూర్ణ ముదచ్యతే !

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేనావశిష్యతే ||


క. పూర్ణ మది, పూర్ణమిదియుం

బూర్ణంబగు దానివలన బూర్ణము పొడమున్

బూర్ణమగు దానిదే యగు

పూర్ణము గొని మిగులుచుండు బూర్ణమె యెందున్.


శా న్తి:|| అప్యాయన్తు మ మాంగాని, వాక్ర్పాణశ్చక్షు శ్శ్రోత్ర

మధోబల మిన్ద్రియాణి చ సర్వాణి, సర్వం బ్రహ్మోపనిషదం,

మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మామా బ్రహ్మ నిరాకరో,

దనిరాకరణ మ, స్త్వనిరాకరణం మే అస్తు, తదాత్మని నిరతేయ

ఉపనిషత్సు ధర్మా న్తేమయి సన్తు తే మయి సన్తు ||


సీ. అప్యాయితములు నాయంగంబు లగు గాత,

ప్రాణంబు వాక్కు నేత్రంబు జెవియు

బల సుఖిలేంద్రియంబులు నట్లయగు గాత

నిఖలంబు బ్రహ్మోపనిషదమె యగు

బ్రహ్మంబు నేను నిరాకరింపగరాదు

బ్రహ్మంబు నన్ను నిరాకరింప

రా, దెందును నిరాకరణము కాకుండుగా

వుత, లేకయుండు గావుత మదీయ

గీ. మగు నిరాకరణంబును, నాత్మనిరత

మైన చోటున నుపనిష ద్వ్యాహృతంబు