పుట:AndhraRachaitaluVol1.djvu/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జరిగినముచ్చట శ్రీవీరేశలింగము పంతులుగారు ముచ్చటించిరి. హిందూమత ప్రశస్తతనుగూర్చి రంగాచార్యులవారు సుధా సహోదరమగు మధురధోరణిలో నుపన్యసించెను. వెనువెంటనే మహారాష్ట్ర పాఠశాల స్థాపించి నడపుచుండిన ముత్తుస్వామి శాస్త్రి భావోద్రేకత నాపలేక "తా నదివఱకు క్రైస్తవ మతావలంబిననియు మీ యనుగ్రహము వలన నేటినుండి హైందవ మతావలంబి నయితిననియు" జెప్పి ప్రణమిల్లెనట. ఆయనకేకాదు, నాడు వీరియుపన్యాసము విన్న పరమతస్థుల మనస్సు లెన్నో హిందూమతమువైపునకు వచ్చి స్థిరపడినవి. వాదవిషయమున గొంత స్వతంత్రత చూపినట్లున్నను, మొత్తముమీద శాస్త్రప్రామాణ్యమునకు దవ్వుగాని త్రోవ రంగాచార్యులవారు తీసినారని యనేకుల యభిప్రాయము.


వీరు తమ యెనిమిదవయేటనే కుంభకర్ణవిజయ మను సంస్కృత కావ్యము రచించిరి. ప్రౌడ భాషాసరస్వతి బొరుదాడ్యులై ----లో విక్టోరియా జూబిలిలో మహామహోపాధ్యాయులై వన్నె గాంచిన రంగాచార్యులవారు బొబ్బిలి,ఉర్లాము,పిఠాపురము,మైసూరు,మందసా మున్నగు సంస్థానములలో సన్మానింపబడిరి. బొబ్బిలి సంస్థానమున మూడు వందల సృచ్ఛకులతో బరశ్శతావధానము గావించిరని ప్రసిద్ధి.


ఆంగ్లములోని "ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా" గ్రంథము తీరు నాదర్శముగా గొని శబ్దార్థ సర్వస్వమను గొప్ప నిఘంటువును వీరు రచించినారు. ఇది వీరి సారస్వతోద్యమములలో శిరోమణి. దీని రచనకు మొత్తము నలువదియేండ్లు పట్టినది. 200 పుటలలో అకార. ఆకారాది పదములు గల రెండు సంపుటములు వెలువరించ బడినవి. శేషభాగ మెంతయో వెలుగు చూడవలసి యున్నదై యున్నది. మొదటి సంపుటములు చూచినచో శ్రీ రంగాచార్యుల వారి విశ్వతోముఖపాండిత్య మందు రూపముగట్టి కనుపట్టును. వీరి తండ్రిగారు శ్రీనివాసాచార్యులు "సర్వశబ్దసంబోధిని" యను అశారాది సంస్కృత