పుట:AndhraRachaitaluVol1.djvu/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారు సంస్కృతవాణి యెంత స్వాధీనముఁ జేసికొని వాడుదురో, జాను తెనుఁగు కూడ నంత ప్రీతితో వాడఁగలరు. "మూగనోము" నుండి రెండు పద్యములు : --


          బియ్యపు గింజలన్ జిగురు పేడిన గందవు వచ్చి బొట్తుతో
          తియ్యని చిన్ని నీ నొసలి తీరులు కుంకుమ తీర్చి ముంగిలన్
          తొయ్యలి! నోము చాఱికలతో పనపాడిన ముద్దరాలు నీ
          పయ్యెద వ్రాల నీవు నతి పట్టిన దీవన లీయఁ జూచెడున్!
                 
                                 
          నీ తెలిపట్టు చీర మెయి నీడలు పారి ముసుంగు నంజ క్రొం
          బూతల తెల్ల లే మొగిలుపోలిక వాలిక గాలిఁ దూలిపో
          నేత బెడంగు కుచ్చెలలు నీ చిఱుకాళుల ముద్దు తోఁచెనో,
          లేఁతపొరాడు పయ్యెద చలించిన పచ్చని తాళి తోఁచెనో!


ఈతీరుగా 'విశ్వనాథ' కవి కవితాహేతి రెండువైపుల వాఁడి కలది. శృంగారవీధి - శశిదౌత్యము - ఋతుసంహారము ఇత్యాదులలోని కవితారీతిలో నీ రెండురకములైన రచనలు కనఁబడుచుండును. ఈయన వ్రాసిన యెన్నో కావ్యఘట్టములు భట్టి కావ్యమును జ్ఞప్తికిఁ దెచ్చు ప్రయోగములతో నిండియుండును. నేఁటి - నాఁటి సాధారణ కవులు, అసాధారణ కవులు కూడ వీరివలె ప్రయోగ వైచిత్రీ వ్యామోహము కలవారు తక్కువ దాక్షిణాత్యులవలెఁ బ్రియతద్ధితులు వీరు. రామాయణ కల్పవృక్షము చూచి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగా రన్నారఁట చమత్కారమునకు : "ఈ గ్రంథమునకు వైశ్వనాథ సాత్యనారాయణీయ - మని పేరు పెట్టుట బాగుగనుండు" నని - రామాయణ పీఠికలో వీరు వ్రాయుచున్నారుగదా,


          నన్నయ్యయుఁ దిక్కన్నయు
          నన్నా వేశించిరి పరిణాహ మనస్సం