పుట:AndhraRachaitaluVol1.djvu/440

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

          నాజగచ్ఛ్రేయసంబులై యలరు తొంటి
          వేంగిరాజుల పాదపవిత్రచిహ్న
          గర్భితమ్మైన యీ భూమి ఖండమందు
          నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్ర జనులు.

                                        
ఇట వేఁగీశుల పాదచిహ్నములు లెవే! లేవుపో! భావనా
స్ఫుట మూర్తిత్వమునైనఁ బొందవు నెదో పూర్వాహ్ణదుష్కాలపుం
ఘటికల్ గర్భమునం దిముడ్చుకొనియెం గాఁబోలు నీపల్లెచో
టట లోకాద్భుతదివ్యదర్శనమటే యాభోగ మేలాటిదో!

                                        
          సీ. ఈ నాపదార్పితక్షోణి నేరాజు ధ
                    ర్మాసనంబుండి స్మృత్యర్థం మనెనొ,
          ఈ నా దృగావృతంబైన భూములలోన
                    నే శౌర్యధనులు శిక్షింపఁబడిరొ,
          ఈ నాశరీరమం దివతళించిన గాలి
                    యెంత పౌరాతన్య మేచుకొనెనొ,
          ఈ నా తనూపూర్ణమైన యాకాశమ్ము

                    నే క్రతుధ్వనులు శబ్దించినదియొ

          అస్మదజ్ఞాతపూర్వదివ్యత్వ మొప్పు
          నీ వునీతావనీఖండ; మిచట నిలచి
          యస్వతంత్రత దొరలు నాయాంధ్రశక్తి
          నన్నుఁ గంపింపఁ జేయుచున్నది భృశమ్ము.


ఈ రకమైన కవితాశయ్య భావులకుఁ గాని దొరకని భావపటుత్వము కలది. అన్వయములోఁ గొంత కఠినత, పదప్రయోగములోఁ గొంత బిగువు నుండుటచే 'విష్ణుచిత్తీయ' పాకము వలె వీరిది సుఖము మరిగిన సుకుమారులకు ఆపాతమధురముగా నుండఁజాలదు. సత్యనారాయణ