పుట:AndhraRachaitaluVol1.djvu/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గించుకొనెను. తరువాత బందరునందుండి 'పర్వతము నృసింహశాస్త్రి' యను పేరుగలవారియొద్ద నాధానపంచకము, శ్రౌతగృహ్యధర్మసూత్రములు మున్నయిన వైదికక్రియావిధానములను సంపూర్ణముగ నభ్యసించెను. మొదటినుండియు సహజమగు కవితచెప్పు నేర్పు కలవాడు గావున బదునెనిమిదవ యేటనే 'కల్యంధకౌముది' యను పేరు పెట్టి కావ్యము వ్రాయ మొదలిడెను. ఇందలి యితివృత్తము వీరేశ్వర లీలావర్ణనము. అది యెన్నో ప్రసారములుగ రచింప నారభించి యొక ప్రసారముతో సమాప్తి చేసెను.


మ.ఇది శ్రీ సానగగోత్ర సంజనిత కోటీశార్య సంతాన సం

పద, వీరేశ్వరయోగి పాదయుగ సేవాశీలి, నిర్వ్యాజకో

విద విశ్వాసి నిరంజనుండు సమవాప్తింజేయు కల్యంధకౌ

ముది లోనం బ్రథమప్రసారము ప్రజామోదంబు సంధించుతన్.


'పౌరుషేయాన్వయ మహాపురుష రత్నమాల' అను గ్రంథము రచింతమని ప్రారంభించెను. ఆ గ్రంథ మనతారికా పద్యములవఱకు వచ్చియాగిపోయినదట. తరువాత 'కుమారాభ్యుదయము' అను నాటకమొకటి శైవమత సమ్మతముగా రచించెను. అది ప్రచురింపబడినది. ధర్మసాలచరితము, భీష్మోదయము, సూర్యశతకము, మాఘమాహాత్మ్యము మున్నగు పెక్కు కృతులు రచించుట కుపక్రమించుటయు, నిందులో నొకకృతియు దుదిముట్టక, నట్టనడుమనో, మొట్టమొదటనో యాగిపోవుటయు, దటస్థించినటులు 'శ్రీనిరంజన విజయము' అను జీవిత చరిత్రమువలన దెలియుచున్నది. నిరంజనశాస్త్రివని ప్రచురింప బడినవి కుమారాభ్యుదయనాటకము గాక, 'బ్రహ్మానంద లీలలు^ అను మఱొకనాటకము. తక్కినవెల్ల సముద్రితములు, నసంపూర్ణములును. ఈరెండునాటకములలోని కవితతీరును, మిగిలిన యసంపూర్ణకావ్యములలోని రచనతీరును బరికింప నిరంజన శాస్త్రిగారు మంచి రచయితలని