Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోచుచున్నది. తాను రచించు 'మాఘమాహాత్మ్యము' నిడుబ్రోలు వాస్తవ్యులు శ్రీ పాములపాటి సుబ్బరాయుడుగారి కంకిత మీయదలచి 'సుబ్బరాయతారావళి' యను పద్యములు చెప్పెను. అవి యెంత సొగసుగ నడచినవో, రెం డుదాహంచెదను జూడుడు.


మ.అరి నిర్భేద్యము నీదుగుట్టు, సకలవ్యాపారసౌకర్య దు

స్తర పాండిత్యము నీదుకట్టు, నిఖిలాశామండలీ మండన

స్ఫుర కీర్తిప్రభ నీదురట్టు, ముదివేల్పుంజెట్టు నీపెట్టు, బల్

సిరి నీవాకిటి కాటపట్టు, బళిరా ! శ్రీ సుబ్బరాయాగ్రణీ!


మ. కవితాకన్యక లెందఱొ నిను సమాకర్షించి పెంపొంది రం

చు విచారించి బహుప్రియారతుడనై శోభిల్లు నీచూడ్కి వై

భవ మబ్బున్ నిజచాకచక్యనిపుణీభావంబు జూపింప వ

చ్చె వరింపదగు మత్కవిత్వరమణిన్ శ్రీ సుబ్బరాయాగ్రణీ!


అసంపూర్ణమైన వీరి 'మాఘమాహాత్మ్యము' లోని పద్యములు మచ్చుచూపినచో నిరంజనశాస్త్రికి విశ్వబ్రాహ్మణ సంఘసభలో నొసగబడిన 'కవిశేఖర' బిరుద మన్వర్థమే యనిపించును.


[మాఘమహిమ-వర్ణనము]

సీ.పారాడునినువు లబ్రపు ముద్దు బలుకుల

గిలకల లాడు ముంగిళులు గలిగి

సిరులు దుటారింప విరిబోండ్లయాటల

దలతలల్ తొలకుమోసలలు గలిగి

పాఱులప్రామిన్కు పదఱుల మిన్నంది

కనకనల్ గొను శుభధ్వనులు గలిగి

తనివాఱ మెనవి గఱ్ఱున ద్రేపునతిథుల

యెడనెడ దొడరుసందడులు గలిగి