పుట:AndhraRachaitaluVol1.djvu/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానితో వేలూరికవి తెలుగువారికి బహుధా ప్రశంసనీయుడయ్యెను. క్రమముగ దెనాలి, బెజవాడ, కొవ్వూరు, చట్రాయి మున్నగు పలుతావుల నవధానములు గావించెను. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి ప్రధాన శిష్యులలో నొకరుగ బ్రకటకీర్తి నందెను. 1915 లో వ్యాకరణము ముగించి యింజరనుండి చిరివాడ చేరికొనెను. ఇంజరములో నున్నప్పటి వీరిచరిత్రము వినదగినది కలదు.


సదాచారసంపన్నుడగు నొకబ్రాహ్మణ కుమారుడు పెండ్లి చేసికొనుటకు డబ్బులేక తంటాలు పడుచుండెను. అప్పుడతనికి దమయింటగల బంగారునగ నమ్మివైచి వివాహమునకు వలసినంతసొమ్ము నొసగెను. అట్టియుదార హృదయ మాయనది. శతావధానము నభ్యాసము చేయుట కింజరములో నూఱుగురు పృచ్ఛకులు దొరకుదురా ? పెద్ద మామిడితోటలోనికి బోయి, యొకమిత్రునిచే బ్రశ్నము లన్నియు గాగితపుముక్కలపై వ్రాయించి కొమ్మలకు గట్టించి పద్యములు చెప్పుచుండు వారు. అట్టి ధారణాబల మాయనది.


చిరివాడ చేరికొని వ్యాకరణము గ్రంథములు పాఠము చెప్పుచు బద్మపురాణము నాంధ్రీకరించు కొనుచు, నాంగ్లము పఠించుచు శాస్త్రిగారు రెండేండ్లు గడపిరి. ఆంగ్ల, పరాసు భాషాగ్రంథములు చదువ జదువ సాధారణమైన తెలుగు కవితపై మన శాస్త్రిగారి కొకవిధమగు నేవము కలిగినది. అపుడు యతిప్రాసములు విడిచిపెట్టి మహాభారతములో నాది సభాపర్వములు, షేక్‌స్పియరు ననుకరించి, పదినాటకములు ఋగ్వేద ఋక్కులు కొన్నియు దెనుగులో వ్రాసి వెనుదిరిగి చూచుకొనిరి. ఆవిప్లవ మాయన యంతరాత్మకే నచ్చలేదు. అప్పుడ నిబంధనములు విడువక 'మణిమేఖల' యను నే డాశ్వాసముల ప్రబంధము రసభావ బంధురముగ రచించిరి. అందలి కవిత్వపు సొగసున గూర్చి, నాడు విన్న వారివలన వినుకలియేగాని యా గ్రంథ మిపు