పుట:AndhraRachaitaluVol1.djvu/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డుత్సన్నమై పోయినది. 'మణిమేఖల' రచించుకాలముననే 'సాహిత్య దర్పణము' సగము, 'రసగంగాధరము' 1 ఆననము, 'ధ్వన్యాలోకము' సంపూర్ణముగను దెనిగించియుంచిరి. పై గ్రంథములెల్ల 'మణిమేఖల' తో పాటు పెట్టెలో బెట్టుకొని యేలూరు శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రులవారి స్మృతి సభకువెళ్ళి యటనున్నపుడు, మకాములో గల యాపెట్టె ధనాశచే రాత్రి దొంగలెత్తుకొని పోయిరట. అది మొదలు శివరామకవికి గొంతరోత కలిగినది. ధైర్యముతో గానీ యనుకొని పిదప వంగ వాజ్మయము చదివెను. పరాసు గద్యవాజ్మయము చూచెను. చదివి చూచి యప్పుడే యించుమించు నూఱుకథలు, ఆఱు చిన్ననాటకములు సంఘటించెను. సాంఖ్య, న్యాయ, వై శేషిక దర్శనములు చదివి భాష్యములతో దెనిగించెను. యోగవాశిష్టము నిర్వాణప్రకరణము వఱకు ననువదించెను. వేదాంతమునకు సంబంధించిన వేవేవో చిన్నచిన్న పుస్తకములు వ్రాసెను. పద్మపురాణమున గొన్ని ఖండ లపుడు వ్రాతలో నున్నవి. ఆసమయములో గ్రంథభాండారముతో నిండిన వీరి యింటిపై నలిగి యగ్ని మండిపడినది. సంస్కృతాంధ్రాంగ్లాది భాషలకు సంబంధించిన గ్రంథము లెన్నో వీరి భాండారమున నున్నవి. శివరామశాస్త్రిగారు నిత్యమక్కడనే కూర్చుండి ప్రతిగ్రంథము చదువుచు జదివిన గ్రంథముపై దమ యభిప్రాయము వ్రాసి యా గ్రంథములోనే పెట్టి యుంవ్హువారట. ఆయా గ్రంథములు తాము రచించి, యచ్చు వేయింత మనుకొనుచున్న గ్రంథములు సమస్తము 1926 సంవత్సరములో నగ్ని కాహుతియై క్షయించినవి.


ఈ పద్యము చదువుడు:

క. క్షయ వత్సరమున నాతప

భయమగు వైశాఖ కృష్ణపక్షంబున మా