పుట:AndhraRachaitaluVol1.djvu/348

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రయ దినమునన్ ద్వితీయో

దయమున జిరివాడ యెల్ల దగ్ధంబాయెన్.

శివరామకవి నెత్తురుజుక్కలైన తన గ్రంథము లట్లు భస్మమైనపుడిటులు వగచెను:


ఉ. పెంచితి బెద్దచేసితిని : ప్రీతియుతంబుగ రాణివాసమం

దుంచితి రాజయోగ్యకును మోపవనంబులు క్రుమ్మరిల్ల ని

ర్మించితి విస్మరించితిని మేదిని మింటిని నొక్కపెట్ట న

ర్పించితి నిన్ను నగ్గికిని బెన్‌బలిగా గవితాసరస్వతీ!


ఉ. కాల్చితి విల్లు సర్వమును గాల్చితి పాత్రము లూచుముట్టుగా

గాల్చితి వెల్లయున్ ధనము కాల్చితి వెల్లయు ధాన్యరాసులన్

గాల్చితి వున్న వెల్లయును గాల్చిన గాల్చితికాక గ్రంథముల్

కాల్చిననీకు నోజ్వలన ! కడ్పది నిండెనొ ? కాలునిండెనో ?


సీ. ఋగ్వేదమా ! యష్టదిగ్వీథులను నన్ను

గన నెంతయడలితో కాలు నపుడు

వేదాంతమా ! నన్ను వీక్షింప యోగదృ

జ్మతి నెంతపూనితో మాడు నపుడు

వ్యాకృతీ ! యలయజ్ణుగంతమౌ 'దృశి' నెంత

వఱపితో నాకయి చరమవేళ

కవితాకుమారి ! నన్ గనుపొంటె నెన్నిము

ఖాల్‌దు:ఖించితో క్రాగుతఱిని


గీ. కట్ట ! సాహితిరో నన్ను గౌగిలింప

నెంత చేతులు చాపితో యేమనందు

నన్ను గంకాళమును జేసి చన్న వారె

పుస్తకములార ! విజ్ఞానపుటములార !