పుట:AndhraRachaitaluVol1.djvu/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచించెను, రచించుచుండెను. వేంకటశాస్త్రిగారి వెనుక సభలకు, సంస్థానములకు, శతావధానములకు దిరుగుచు ముందునకు వచ్చెను. వచ్చి 'గుంటూరు కళాశాల' లో బ్రతిజ్ఞజేసి 'నహిప్రతి' యన్నట్లు శతావధానము గావించెను. అప్పటికి శివరామకవి కిరువదియేండ్లు దరిలో నుండును. 1911 సంవత్సర ప్రాంతము. తిరుపతివేంకటకవులకు, కొప్పరపు సోదరకవులకు వాగ్యుద్ధములు జరుగుచున్న సమయ మది. తిరుపతి కవులకు శిష్యుడగుట శివరామకవ్ గురువిరోధుల నెదురుకొని యిట్లు సింహగర్జనము గావించెను-


మ. అనిమిత్తంబుగ గాలుద్రవ్విన త్వదీయా హంత నాపుం దలం

పున నీ నీరస నిర్గుణాశుకవనంబుంజెప్పి నిన్గెల్వ నెం

చిన యస్మద్గురువర్యులన్ సుకవితా శ్రీ ధుర్యులన్ మానిపిం

చి నినున్ గెల్వగ వచ్చినా నిదె సభం జేయింతువో ? వత్తువో ?


గుంటూరు కళాశాలలో నేర్పాటు చేయబడిన యవధాన మప్పటి పరీక్షార్థమే. నిరాక్షేపముగ శతావధానము కొనసాగినది. సభాసదులు సెబాసనిరి. గురువులు తిరుపతికవులు శిష్యుని శివరామకవి ని మెచ్చి యిటులు దీవన లిచ్చిరి-


మ. జగతీనాథులు పెక్కుమంది ముదితస్వాంతంబునం గాన్కలం

పగ సాంగంబు సలక్షణంబుగ శరద్ద్వావింశతిం బేర్మి హె

చ్చగ మాయేలిన యీవధాన కవితాసామ్రాజ్య భారంబు మో

యగ బూసంగదవయ్య! తండ్రి! శివరామయ్యా! చిరంజీవియై


శా. బాల్యోద్రేకముమై నెదిర్చితివి కొప్రంపుంగవిన్ గ్రంథసా

కల్యంబుం బొనరింతో లేదొయని నీకై కొంకు నస్మ న్మన

శ్శల్యం బిప్పటి కూడదీసితిని వత్సా! సత్సభాశోభివై

కళ్యాణంబుల బొందుమయ్య! యికవీకన్ శిష్యచూడామణి!